ఎమ్మార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు.. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఆలూరు రోడ్డు చిప్పగిరి రైల్వే బ్రిడ్జి వద్ద ఈ ఘటన జరిగింది.. గుంతకల్ నుండి చిప్పగిరికి లక్ష్మీనారాయణ వెళ్తుండగా హత్య చేశారు..
హైస్కూల్ గ్రౌండ్లో విద్యార్థులు అంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. జరిగిన ఓ ఘటన ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌతాళం మండలం కాత్రికిలో పిడుగు పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్.. వైఎస్ జగన్ మానసిక స్థితి బాగాలేదని ప్రజలు గమనించారని.. అందుకోసమే లండన్ వెళ్లి వైద్యం చేయించుకున్నారని.. అది సెట్ అవ్వని పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధిని చూసి మరింత మానసిక శోభకు గురైతే ప్రభుత్వం తరఫున అన్ని విదాల ఆయనకు సహకరిస్తూ మంచి ఆసుపత్రిలో వైద్యం చేయిస్తాంమని సెటైర్లు వేశారు కార్మిక శాఖ మంత్రి సుభాష్.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మీద బోలెడు ఆశలు పెట్టుకుంది తెలంగాణ బీజేపీ. వాస్తవంగా మాట్లాడుకుంటే.... ఆ పార్టీకి సీటు గెలిచేంత బలం లేదు. ఆ విషయం పార్టీ ముఖ్యులు అందరికీ తెలుసు. పిక్చర్ క్లియర్‌గా ఉంది. అయినా సరే... ఉనికి కోసం బరిలో దిగింది కాషాయ దళం. అంతవరకు బాగానే ఉంది. కానీ.... ఆ పోటీ పేరుతో తమను తాము పరీక్షించుకునే దగ్గరే తేడా కొట్టిందంటున్నారు పరిశీలకులు. బీజేపీ కార్పొరేటర్స్ అందరి ఓట్లు కమలానికి పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య మరోసారి రాజుకున్న వివాదం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది? రెండు సార్లు ఎంపీగా గెలిచిన అన్న నానిని గత ఎన్నికల్లో మొదటి ప్రయత్నంలోనే ఓడించి రికార్డు మెజార్టీతో పాగా వేశారు తమ్ముడు కేశినేని చిన్ని. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఈ అన్నదమ్ముల మధ్య వివాదం 2024 ఎన్నికలకు ముందు బయట పడింది. నాని ఎంపీగా ఉన్నప్పుడే... టీడీపీలో యాక్టివ్ అయిపోయి ఆయనకు పక్కలో బల్లెంగా మారారట చిన్ని. చివరికి ఇద్దరి మధ్య కేసులు, సవాళ్ళ వరకు…
అది ఆంధ్రప్రదేశ్ అయినా.... ఉత్తరప్రదేశ్ అయినా... బీజేపీకి ఉన్న ముద్ర మాత్రం అగ్రవర్ణాల పార్టీ అని. అందులోనూ భేషజాలు లేకుండా చెప్పుకోవాలంటే... బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఈ ముద్రనే చెరిపేసుకునే దిశగా అడుగులేస్తోందట. అగ్రవర్ణ ముద్రను పోగొట్టి... బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్య పార్టీగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
డొక్కా మాణిక్య వరప్రసాద్.... ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 2004లో గుంటూరు జిల్లా తాడికొండనుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2009లో కూడా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు మాజీమంత్రి. ఇంకా చెప్పాలంటే... ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం తీవ్ర ఒడిదుడుకుల్లో పడింది. అందు కారణం అంతా స్వయంకృతమేనంటారు పొలిటికల్ పండిట్స్. నిలకడలేని నిర్ణయాలతో తన రాజకీయ జీవితానికి తానే గొయ్యి తవ్వుకున్నట్టు చెప్పుకుంటారు.
నీటి కుంటలో మునిగి నలుగురు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. మొలకలచెరువు మండల కేంద్రానికి చెందిన మల్లేష్ (36), అతని కుమార్తె లావణ్య (12), కుమారుడు నందకిషోర్ (10) కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు బట్టలు ఉతికేందుకు వెళ్లారు.. ఈ క్రమంలో ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోకి దిగిన నందకిషోర్, అతని స్నేహితురాలు నందిని నీటిలో మునిగిపోతుండగా.. అది చూసిన లావణ్య పెద్దగా కేకలు వేసింది. అంతేకాదు..
నడిగడ్డ ప్రాంతంగా చెప్పుకునే గద్వాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి అసెంబ్లీకి పంపిన ఇక్కడి ఓటర్లు.. 2018, 2023 ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో గద్వాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి... మంత్రి జూపల్లి ప్రోద్బలంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో "భారత ప్రభుత్వం అత్యవసర భద్రతా సలహా" పేరుతో సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ డీజీపీ.. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల పేరుతో సోషల్ మీడియా వేదికగా వదంతుల వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలను హై అలెర్ట్ జోన్స్ గా ప్రకటించారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.