తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే..! మీ పెత్తనం ఏంటి..?
సొంత పార్టీ నేతలపై మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆ ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరిగింది.. అయితే, అప్పటి నుంచి పార్టీ ఆయన్ని పక్కకు పెట్టేసిందనే విమర్శలు ఉన్నాయి.. ఈ విషయంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ రోజు సత్యవేడులో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన…? ఒక ఎమ్మెల్యేనే పక్కనపెట్టి మీరే పనులు చేసుకుంటారా..? అని ప్రశ్నించారు.. ఒకరి కో-ఆర్డినేటర్, మరొకరు పరిశీలకుడు అంటారు.. ఎంతమంది పెత్తనం చెలాయిస్తారు సత్యవేడుపై అంటూ ఫైర్ అయ్యారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న నాకు కాకుండా బయట వ్యక్తులకు ఎస్పీ ఎలా సెల్యూట్ చేస్తారు…? అని ప్రశ్నించారు ఆదిమూలం.. శంకర్ రెడ్డికి నాకు మధ్య ఎంతో అనుబంధ ఉంది.. కానీ, రిజర్వ్ నియోజవర్గంలో ఇలా చేయమని సీఎం చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు.. కొంతమంది గొర్రెల్లాగా ఎవరు వెంటపడితే వారి వెంట వెళ్తున్నారు.. అయితే, గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు నియోజకవర్గంలో చేయొద్దని సూచించారు.. కనీసం, నన్ను కాకపోయినా.. నా కొడుకును అయినా పార్టీ కార్యక్రమాలకు తీసుకు వెళ్లవచ్చు కదా? అని ప్రశ్నించారు.. మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం.. కానీ, కొందరు మాత్రమే మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు సత్యవేడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం..
మరోసారి ఢిల్లీ బాట.. రేపు హస్తినకు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ఉదయం.. 9.45కి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి.. ఉదయం 11.45 కు ఢిల్లీ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.. ఆ తర్వాత, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కాబోతున్నారు.. ఇక, రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరుగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఎల్లుండి కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కానున్న ఆయన.. ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు.. ఎల్లుండి సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకానున్నారు.. ఈ నెల 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఉద్యోగ కల్పనపై దృష్టిపెట్టింది.. ఓవైపు ప్రైవేట్ సెక్టార్‌లో పెట్టుబడులు ఆకర్షించి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.. మరోవైపు, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే మెగా డీఎస్సీపై ముందడుగు వేసిన ప్రభుత్వం.. ఇతర శాఖల్లోనూ ఖాళీలు పూర్తి చేస్తోంది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. అటవీ శాఖలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.. ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇచ్చింది.. ఇక, ఏపీపీఎస్సీ.. అటవీశాఖలో 691 బీట్ ఆఫీసర్.. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం.. https://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు..
‘ధర్మవరం’ పట్టు చీరకు జాతీయ గుర్తింపు..
మన ధర్మవరం చేనేత పట్టు చీరకు జాతీయ గుర్తింపు లభించింది.. దీనికి సంబంధించిన “ఒక జిల్లా ఒక ఉత్పత్తి” (ODOP – One District One Product)- 2024 అవార్డును ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు అందుకున్నారు మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్.. కాగా, భారత దేశ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ధర్మవరం చేనేత పట్టు చీర 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఒక జిల్లా ఒక ఉత్పత్తి” కార్యక్రమం క్రింద ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది.. ఈ గౌరవం ధర్మవరం పట్టు చీరల ప్రత్యేకతను, నైపుణ్య సంపదను దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపుచేసే దిశగా కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు..
ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ.. ఎల్లుండి సీఎంల భేటీ..
నీటి వాటాలపై తేల్చుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పడుతున్నారు.. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశం ఖరారైంది.. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఖరారు చేసింది.. ఢిల్లీ వేదికగా ఎల్లుండి మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు.. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశాన్ని ఫిక్స్ చేసింది జలశక్తి శాఖ.. ఎల్లుండి మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్న ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు ముఖ్యమంత్రులు.. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గత పర్యటనలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రిని కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి.. ఈ నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పిడింది.. అయితే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంతో సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. అయితే, ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది.. రేపు ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. ఉదయం.. 9.45కి విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి.. ఉదయం 11.45 కు ఢిల్లీ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. ఇక, మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.. ఆ తర్వాత, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీలతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కాబోతున్నారు.. ఎల్లుండి కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశం కానున్న ఆయన.. ఆ తర్వాత నార్త్ బ్లాక్ లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు.. అయితే, ఇప్పటి వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు కాకపోయినా.. కేంద్ర జలశక్తి శాఖ.. తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ఖరారు చేయడంతో.. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.. మొత్తంగా కృష్ణా నది, గోదావరి నదుల్లో నీటి వాటపై, ఆ నదులపై ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించబోతున్నారు..
పేదవాడికి రేషన్ కార్డు అతని గౌరవానికి ప్రతీక
తెలంగాణలో రేషన్ కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాకుండా, అది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని, ఆకలి తీరేందుకు ఉపయోగపడే ఆయుధమన్నారు. కానీ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ విషయం తెలుసనిపించలేదని ఆయన వ్యాఖ్యానించారు. వారి పాలనలో రేషన్ కార్డులు మంజూరు చేయడం, సన్నబియ్యం అందించడం అనే అంశాలు వెనుకబడ్డాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించామని తెలిపారు. “ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తుంటే, రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నాయి. ఇది మాకు గర్వకారణం,” అని అన్నారు.
తప్పిన పెను ప్రమాదం.. విమానాన్ని ఢీ కొట్టిన కార్గో వాహనం..!
ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఒక ఘోర ప్రమాదం తప్పింది. ఢిల్లీకి వెళ్లాల్సిన అకాసా ఎయిర్‌లైన్స్ QP1410 విమానం, టేకాఫ్‌కు ముందు ఓ కార్గో కంటైనర్ వాహనం ఢీకొనడంతో విమానానికి, కార్గో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున సుమారు 4:54 గంటలకు చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన QP1736 విమానం ముంబయికి చేరుకుని బే A-7 వద్ద పార్క్ చేయబడింది. ఇదే విమానం తరువాత QP1410గా ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే, ప్రయాణికుల బోర్డింగ్‌కు ముందు కార్గో సంబధించిన పనులు కొనసాగుతున్న సమయంలో, BWFS (Bird Worldwide Flight Services) కు చెందిన ఓ కంటైనర్ వాహనం విమానం కుడి వైపు రెక్కను ఢీకొట్టింది.
చైనాలో బిజీ బిజీగా జైశంకర్.. వైస్ ప్రెసిడెంట్, ఫారన్ మినిస్టర్‌తో భేటీ..
చైనాతో భారత సంబంధాలు నార్మల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. జూలై 14, 15 తేదీల్లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన డ్రాగన్ కంట్రీకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే చైనా కీలక నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మద్య సంబంధాలు క్షీణించాయి. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రెండు దేశాలు సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో జైశంకర్ భేటీ అయ్యారు. ‘‘ఒకరికొకరు విజయాన్ని సాధించడానికి వీలుగా భాగస్వామ్యం ఏర్పాటు చేయడం, డ్రాగన్-ఎలిఫెంట్ డ్యాన్స్ సాధించడం సరైన ఎంపిక. ఒకరి ఆందోళనల్ని మరొకరు గౌరవించుకోవాలి. చైనా-భారత్ సంబంధాల స్థిరమైన ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించాలి’’ అని జెంగ్ సోమవారం జైశంకర్‌ని కలిసిన తర్వాత అన్నారు. డ్రాగన్, ఏనుగు అనేది చైనా, భారత్ దేశాలను సూచిస్తుంది. గతంలో ఆదేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా భారత సంబంధాల విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌ను టార్గెట్ చేసుకున్న స్కామర్లు.. నకిలీ కస్టమర్ సపోర్ట్, క్లోన్ వెబ్‌సైట్లతో వల..!
జూలై 17వ తేదీ వరకు కొనసాగనున్న ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ మరోసారి సైబర్ మోసగాళ్లకు అడ్డగా మారింది. గత ఏడాది మాదిరిగానే.. ఈసారి కూడా డూప్లికేట్ వెబ్‌సైట్లు, నకిలీ కస్టమర్ సపోర్ట్ ఖాతాలు, ఫిషింగ్ లింకులు వంటివి పుట్టుకొచ్చాయి. వీటితో వినియోగదారులను మోసం చేసి వారి ప్రైవేట్ డేటా, డబ్బులను దొంగలిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఓ నివేదిక ప్రకారం.. కనీసం పదికి పైగా నకిలీ వెబ్‌సైట్లు, ఫిషింగ్ లింకులు గుర్తించబడ్డాయి. ఈ సైట్లు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను అనుకరిస్తూ ఉండి.. flipkart.garud*.in**, flipkart.aditya**.com** లాంటి పేర్లతో కనిపిస్తున్నాయి. ఇవి ఐఫోన్లు, వన్‌ప్లస్ మొబైల్స్ రూ.1,000కంటే తక్కువ ధరకు, MacBook ఎయిర్ రూ.7,999కి, పురుషుల జాకెట్లు రూ.55కి, మహిళల జాకెట్లు రూ. 29కి అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు చూపిస్తున్నాయి. ఇవి మొత్తం అసలైన డిజైన్‌ను కాపీ చేసి, వినియోగదారులు సులభంగా నమ్మేలా రూపొందించబడ్డాయి. ఈ డూప్లికేట్ సైట్లు ఎక్కువగా GOAT సేల్ ప్రారంభానికి రెండు వారాల ముందు క్రియేట్ అయ్యాయి.
లాంచ్‌కు ముందే ఫీచర్స్ వెల్లడి.. 7,000mAh భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిస్ప్లే ఫీచర్లతో రాబోతున్న రియల్‌మీ 15 ప్రో..!
రియల్‌మీ ఇండియా స్మార్ట్‌ఫోన్ సిరీస్ అయిన Realme 15 ప్రో 5G ను జూలై 24న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌తో పాటు Realme 15 5G కూడా లాంచ్ కానుంది. రియల్‌మీ ఇప్పటికే ఈ సిరీస్‌లో AI ఆధారిత ఫోటో ఎడిటింగ్ టూల్స్ అయిన AI ఎడిట్ జిని, AI పార్టీ ఫీచర్లను అందించనున్నట్లు ధృవీకరించింది. మరీ త్వరలో విడుదల కాబోతున్న ఈ మొబైల్ విశేషాలను చూద్దామా.. ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయిన వివరాల ప్రకారం, రియల్‌మీ 15 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మందం కేవలం 7.69mm మాత్రమే ఉండనుంది. అంటే భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ స్లిమ్‌గా ఉంటుంది.
బాయ్ ఫ్రెండ్ తో ప్రభాస్ హీరోయిన్.. లండన్ లో చెక్కర్లు
ప్రభాస్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తో చెక్కర్లు కొడుతోంది. ఈ నడుమ ఈ బ్యూటీ వరుసగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా అందరి అటెన్షన్ తన మీద పడేలా చేసుకుంది. ఆమె ఎవరో కాదండోయ్ కృతిసనన్. ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ లో హీరోయిన్ గా చేసిన కృతి సనన్ మీద తరచూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. గతంలో ప్రభాస్ తో డేటింగ్ చేస్తోందంటూ రూమర్లు వచ్చాయి. అవన్నీ ఫేక్ అంటూ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. కానీ కొన్ని రోజులుగా ఆమె కబీర్ బహియాతో లవ్ లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తరచూ ఇద్దరు కలిసి బయట తిరుగుతున్నారు. సీక్రెట్ గా వీరు తిరుగుతున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి-మహేశ్ మూవీ చేయకపోవడానికి కారణం అదే..
రాజమౌళి తన ప్రతి సినిమాలో కొందరిని కంటిన్యూ చేస్తుంటారు. కొందరు యాక్టర్లను రెగ్యులర్ గా తీసుకునే రాజమౌళి.. కొందరు టెక్నీషియన్లను కూడా కంటిన్యూ చేస్తుంటారు. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సెంథిల్ కుమార్. సినిమాటోగ్రాఫర్ అయిన సెంథిల్ కుమార్ – రాజమౌది ఇరవై ఏళ్ల అనుబంధం. మొదటి నుంచి రాజమౌళి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. బాహుబలి, త్రిబుల్ లాంటి సినిమాలకు ఆయన చేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి-మహేశ్ కాంబోలో వస్తున్న సినిమాకు సెంథిల్ కుమార్ చేయట్లేదు. దీనిపై చాలా రకాల రూమర్లు ఉన్నాయి. వాటిపై తాజాగా సెంథిల్ క్లారిటీ ఇచ్చారు.