ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి కీలక సూచనలు వచ్చాయని ప్రకటించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్.. దాడి జరిగే అవకాశం ఉందని వైమానిక దళ కేంద్రం నుండి వైమానిక హెచ్చరిక అందింది.. సైరన్లు మోగుతున్నాయి.. అందరూ ఇంటి లోపలే ఉండండి.. ఇంట్లో బాల్కనీలకు కూడా దూరంగా ఉండాలని సూచించారు చండీగఢ్ డిప్యూటీ కమిషనర్..
పాక్ పన్నాగాలను తిప్పికొడుతూనే.. ముందుస్తు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది భారత్.. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో అంతటా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.. జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా అన్ని పాఠశాలలు నేడు మరియు రేపు మూసివేయబడతాయి..
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పాక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. 'ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది' అంటూ ట్వీట్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్..
నిన్న రాత్రి, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC) మరియు అంతర్జాతీయ సరిహద్దులు (IB) వెంబడి వివిధ ప్రదేశాలకు డ్రోన్లను పంపడానికి పాక్ విఫలయత్నం చేసింది.. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా మరియు పఠాన్కోట్ ప్రాంతాలలో పాక్ చర్యలకు భారత్ తిప్పికొట్టింది.. భారత ఆర్మీ వైమానిక రక్షణ విభాగాలు ఉపయోగించి.. పెద్ద ఎత్తున కౌంటర్-డ్రోన్ ఆపరేషన్లో 50కి పైగా పాక్ డ్రోన్లను విజయవంతంగా తటస్థీకరించింది..
జమ్మూ కాశ్మీర్లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా.. ఉదయం పరిస్థితి సాధారణంగా ఉంది.. భారత వైమానిక రక్షణ విభాగాలు.. రాత్రిపూట పాకిస్తాన్ డ్రోన్లు మరియు క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రజల నివాస ప్రాంతాలపై దాడులకు పాల్పడింది.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్న పాకిస్తాన్ సైన్యం.. ప్రజల కార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పలకు తెగబడింది..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆపరేషన్ సిందూర్ను అభినందిస్తూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది.. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది కేబినెట్..
చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి.. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోం.. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు..
ఎవ్వరినీ వదలం.. ఎక్కడున్నా.. కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అని సూచించారు వైఎస్ జగన్.. ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కర్నూలు జిల్లా కోర్టు.. ఈ కేసులో నిందితులగా ఉన్న 11 మందికి జీవిత ఖైదు విధించింది.. ఈ మేరకు జిల్లా జడ్జి కబర్ది తీర్పు చెప్పారు. 2017 మే 21న వివాహానికి వెళ్లి వస్తుండగా కృష్ణగిరి మండలం రామకృష్ణాపురం శివారులో నారాయణరెడ్డి వాహనాన్ని అడ్డగించి నరికి హత్య చేశారు. ఈ హత్య కేసులో మొత్తం 19 మంది నిందితులు కాగా ఒకరు…