ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను అరెస్ట్ చేశారు..
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షలు జరిమానా విధించేలా బిల్లు రూపొందించింది.. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలిపారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
అవినీతిలో రెండవ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారన్నది ప్రజలకి తెలుస్తుందని ఆరోపించారు.
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. అసలు, విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి సబంధం లేదని స్పష్టం చేసింది.. కొమ్మినేని విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది..
శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత బాగా పెరిగిందని కితాబిచ్చారు టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు.. కుటుంబసభ్యులతో కలసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన దగ్గుబాటి సురేష్ బాబు.. ఈ రోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు సురేష్ బాబు..
తిరుమలలో మరోసారి ఆగమ శాస్త్రం ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానం వెళ్లడం భక్తులను ఆవేదనకు గురిచేసింది. ఆగమశాస్ర్తం నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై ఎలాంటి సంచారం జరగుకూడదని ఆగమ పండితులు పేర్కొంటున్నా.. అందుకు విరుద్ధంగా ఆలయ గోపురంపై విమానాలు వెల్తూండడం విమర్శలకు తావిస్తుంది.