CM Chandrababu: ఏఐ సింగపూర్‌కు చంద్రబాబు ఆహ్వానం.. ఏపీలో ఏఐ రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్లకు సహకరించండి
- మూడో రోజు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన..
- ఎస్ఐఏ ఇంజినీరింగ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌జీ జాన్ లిన్ విలిన్‌తో భేటీ..
- ఏపీలో ఎయిర్ పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలపై వివరణ..
- రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక అనుకూల పాలసీపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన సింగపూర్ పర్యటనలో ఇందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పర్యటన 3వ రోజైన మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామ్యంగా పని చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్‌చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైనా చంద్రబాబు-కంకణవల్లి మధ్య చర్చ జరిగింది.
Read Also: CM Chandrababu: ఏపీ ప్రజల తరపున సింగపూర్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన సీఎం..
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఇక, మూడో రోజు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన లో ఎస్ఐఏ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్‌జీ జాన్ లిన్ విలిన్‌తోనూ చంద్రబాబు సమావేశం అయ్యారు.. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల నిర్మాణం, అభివృద్ధి ప్రణాళికలను జాన్ లిన్ విలిన్‌కు వివరించారు.. ఎంఆర్‌ఓ విధానం ద్వారా కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు.. రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా తీసుకువచ్చిన పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి చర్చించారు. ముఖ్యంగా విమానయాన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.. ఏపీలో పర్యటించి పెట్టుబడులపై ఆలోచన చేయాలన్నారు.. దీనిపై సానుకూలంగా స్పందించారు ఎస్ఐఎ ఇంజినీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్.. తర్వలోనే రాష్ట్రానికి తమ కంపెనీ ప్రతినిధులను పంపిస్తామన్నారు.. ఎస్ఐఏ ఇంజినీరింగ్ వంటి సంస్థల అనుభవం, టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి ఎంఆర్ఓ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.. ఈ కేంద్రం ఏర్పాటుకు విశాఖపట్నం, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు అనుకూలమని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది..
తాజావార్తలు
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..