YS Jagan : ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రెడ్‌బుక్ తీసుకొచ్చిన నారా లోకేష్.. తప్పుచేసినవారిని వదిలేది లేదంటూ హెచ్చరిస్తూ వచ్చారు.. ఇక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఏ కేసులు పెట్టినా.. అది రెడ్‌బుక్ ప్రకారమే జరిగుతోందని.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. అయితే, ఇప్పుడు వైఎస్ జగన్ డిజిటల్ ఉద్యమానికి తెరలేపేందుకు రెడీ అవుతున్నారు.. త్వరలోనే ఓ యాప్ తీసుకు వస్తున్నాం.. అన్యాయం జరిగినా.. తప్పు జరిగినా.. ఆ యాప్‌లో అప్‌లోడ్ చేయండి.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
Read Also: Amit Shah: పాకిస్థాన్‌పై ఎందుకు యుద్ధం చేయలేదు.. విపక్షాల ప్రశ్నకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైసీపీ పీఏసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్.. త్వరలోనే పార్టీ తరఫున యాప్ విడుదలచేస్తాం.. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా.. వెంటనే ఆ యాప్‌లో నమోదు చేయవచ్చు అన్నారు.. పలానా వ్యక్తి, పలానా అధికారి.. వారి కారణంగా అన్యాయంగా ఇబ్బంది పడ్డానని చెప్పొచ్చు.. ఆధారాలు కూడా ఆ యాప్‌లో పెట్టొచ్చు.. ఆ ఆధారాలన్నీ కూడా అప్‌లోడ్ చేయొచ్చు.. ఆ కంప్లైంట్ ఆటోమేటిగ్‌గా మన డిజిటల్ సర్వర్‌లోకి వచ్చేస్తోందన్నారు.. అయితే, ఆ ఫిర్యాదులపై మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కచ్చితంగా పరిశీలన చేస్తాం అని వెల్లడించారు.. అన్యాయానికి గురైన వారంతా ఈ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు.. ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలను అప్‌లోడ్ చేయొచ్చు.. ఈ ఫిర్యాదులపై పరిశీలన జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం అని మరోసారి వైఎస్ జగన్ హెచ్చరించారు.