ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి, లేకుంటే ఎన్ని చర్చలు జరిపినా ఆశించిన ఫలితం రాదని స్పష్టం చేశారు భారత మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. ఇప్పుడు భారత్ జాగ్రత్తగా ఉండాలన్నారు.. ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వాములైనమా అధికారులకు సెల్యూట్ చేయండి, వారిని చూస్తే గర్వంగా ఉంది.. సాయుధ దళాలు అద్భుతమైన నిర్ణయాలతో విజయం సాధించాయి అంటూ ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపించారు.
బాహుబలి రెండే పార్టులు.. కానీ, కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకు.. అంటే పది పార్టుల వరకు ఉంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోన్న వేళ.. కేశినేని నానిపై విరుచుకుపడ్డారు వెంకన్న.. పదేళ్లు పార్లమెంటు మెంబర్‌గా ఉండి ఆ పార్టీని, అధ్యక్షుడుని లెక్క చేయకుండా మట్లాడిని వ్యక్తి నాని అని ఫైర్ అయ్యారు..
ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు.. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్ యాదవ్ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్... సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి..
ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్‌లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు.. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.
సహరిద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ.. బ్లాకౌట్లు ప్రకటిస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, ఈ సమయంలో మీ ఫోనే.. మీకు శ్రీరామ రక్షగా నిలవబోతోంది.. Androidతో పాటు iPhoneలలో అత్యవసర హెచ్చరికలను జారీ చేస్తోంది.. ఈ అత్యవసర హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రత్యేక నెట్వర్క్ ఛానెల్‌ని ఉపయోగిస్తారు.. నెట్‌వర్క్‌లు రద్దీగా ఉన్నప్పుడు కూడా అవి మీ ఫోన్‌ను చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. మనం చేయాల్సిందల్లా.. మన ఫోన్లో సెట్టింగ్‌లు కాస్తా మార్చుకుని.. ఆ హెచ్చరికలు వచ్చేలా చూసుకోవడమే..
దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరి బహిరంగ క్షమాపణలు చెప్పారు.. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఒక ప్రకటనలో, ఈ చిత్రం వెనుక ఉద్దేశ్యం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం లేదా రెచ్చగొట్టడం కాదని దర్శకుడు ఉత్తమ్ మహేశ్వరి స్పష్టం చేశారు.
'ఆపరేషన్ సిందూర్'పై బాలీవుడ్ సినిమా రాబోతోంది.. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్య అయిన 'ఆపరేషన్ సిందూర్' ఆధారంగా ఈ బాలీవుడ్ చిత్రం రాబోతోంది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు.. అంతేకాదు.. ఓ పవర్ఫుల్ పోస్టర్‌ను.. అంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు.
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో నేటి నుంచి హాస్టళ్లు తాత్కాలికంగా మూసివేశారు వర్సిటీ అధికారులు.. భారత్-పాక్ యుద్ధం కారణంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు ముగిసిన వారు వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించాయి జీ7 దేశాలు, భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి. క్షిపణి దాడుల ఆరోపణల నేపథ్యంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని జీ7 దేశాలు శనివారం కోరాయి.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభం అయ్యాయి.. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతా సంసిద్ధత పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఒక సలహా జారీ చేశారు.. ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయి.