ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు.. గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండాల్సిన సమయంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.. ఓవైపు వానలు దంచికొడుతుంటూ.. మరోవైపు ఎండలు బంబేలిస్తున్నాయి.. ఇక, రానున్న రెండు రోజుల్లూను.. భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట దక్కింది.. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. రెండు సార్లు కూడా బెయిల్ తిరస్కరించింది కోర్టు.. దీంతో.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఆ పిటిషన్‌పై ఇటీవల ఇరు వర్గాల తరపు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. ఈ రోజు వల్లభనేని వంశీ మోహన్‌కు బెయిల్ మంజూరు చేసింది..
కూటమి ప్రభుత్వం పాలన, సీఎం చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తుందని వ్యాఖ్యానించిన ఆమె.. వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలి అంటూ పిలుపునిచ్చారు... చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేశా చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయార్జన శాఖలపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టెక్నాలజీ సహాయంతో పన్ను ఎగవేతలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు.. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది అన్నారు సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
2021 మే 14వ తేదీన నాపై రాజద్రోహం కేసు పెట్టి నన్ను తీసుకెళ్లి ఏం చేసారో అందరికీ తెలుసు.. అదే వాళ్ల చావుకు వచ్చిందన్నారు.. నా రచ్చబండ ద్వారా వాళ్లు ఎంత పనికిమాలిన వాళ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్లు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు.. అందుకే ప్రజలు కక్షతో ఓడించారనా పేర్కొన్నారు.. రేపు నా పుట్టినరోజు, నన్ను కొట్టిన తర్వాత ప్రజలంతా ప్రతీకారం తీర్చుకున్న రోజు.. అందుకే, రేపు ప్రతీకార దినోత్సవాన్ని స్థానిక రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ జరుపుతున్నాం అని ప్రకటించారు..
వల్లభనేని వంశీ నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు.. నాకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు తెలిపిన వంశీ.. తాను మాట్లాడేందుకు కూడా ఇబ్బంది ఉందని.. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాను అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
తిరుమలలో భక్తుల రద్దీ సాదారణంగానే ఉంది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది టీటీడీ.. మే 15వ తేదీ నుంచి.. అంటే ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పునః ప్రారంభించనున్నట్టు టీటీడీ పేర్కొంది..
సహజ మరణాలను లాకప్ డెత్‌లుగా పేర్కొంటూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. సహజ మరణాలను లాకప్డెత్లుగా పేర్కొంటూ కథనాలను వండి - వార్చి, వడ్డిస్తున్న పత్రికలు మరియు సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు..