తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఏడాదిగా బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. అసలు సొంత నియోజకవర్గంలోకి ఏంట్రీ లేకపోవడం ఏంటీ.. అంటే, 2024 అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వెళ్ళాల్సిందే. అప్పట్లో జరిగిన ఎన్నికల గొడవలతో... ఇటు జేసీ ఫ్యామిలీని అటు పెద్దారెడ్డి ఫ్యామిలీని తాడిపత్రిలో అడుగు పెట్టకుండా ఆంక్షలు విధించింది కోర్ట్. కొన్ని రోజుల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
నేతలందు చిత్తూరోళ్ళు వేరయా అన్నట్టుగా ఉందట టీడీపీలో పరిస్థితి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలు గెలిచింది కూటమి.దీంతో పార్టీ కోసం పని చేసిన ముఖ్య నేతలంతా... మంత్రి పదవులు కోసం, మిగిలిన వారు నామినేటెడ్ పదవుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
శ్రీశైలం జలాశయం.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్తక సాధక ప్రాజెక్టు శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 2009లో ప్రమాదంలో పడింది.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వెంటాడుతూనే ఉంది.. అయితే, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందట.. దీనికోసం క్లౌడ్-సీడింగ్ ట్రయల్స్ నిర్వహిస్తుంది.. ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించనున్నట్టు తెలుస్తుండగా.. ఒక్కొక్కటి వేర్వేరు రోజుల్లో, విమానాలు మేఘాలలోకి రసాయనాలను ఇంజెక్ట్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల పాటు పనిచేస్తాయని ఓ అధికారి తెలిపారు.
వరల్డ్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్.. కోహ్లీ అంటూ భారత మాజీ క్రికెటర్, జాతీయ మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ ప్రశంసించారు.. విరాట్ కోహ్లీని ఒక ఐకాన్‌గా.. ఈ ఫార్మాట్ ఆడిన గొప్ప టెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా తాను భావిస్తున్నానని అన్నారు శరణ్‌దీప్ సింగ్.. కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు, 123 మ్యాచ్‌ల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేసిన కింగ్.. ఒక అద్భుతం.. నిజానికి విరాట్ ఒక ఐకాన్. టెస్ట్ క్రికెట్ ఆడిన గొప్ప ఆటగాళ్లలో అతను ఒకడు.. అతను ఎల్లప్పుడూ…
ధృవీకరించబడిన వ్యాపారాల నుండి సందేశాలను ఫిల్టర్ చేయడానికి ట్రూకాలర్ AI- ఆధారిత సందేశ IDలను పరిచయం చేసింది.. ట్రూకాలర్‌లో ఈ ఐడీలు ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చింది.. స్పామ్ టెక్స్ట్‌లతో నిండిపోయిన ఇన్‌బాక్స్‌లోని ప్రామాణిక సందేశాలను ఫిల్టర్ చేయడంలో వినియోగదారులకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ట్రూకాలర్ ఈ రోజు ఒక కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది.