ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్ట్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. మద్యం కుంభకోణంలో కేసులో A 31 ధనుంజయ రెడ్డి, A 32 కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం రోజు అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సిట్ అధికారులు.. సుమారు మూడు గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగాయి..
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం స్కీమ్‌పై మంత్రుల బృందాన్ని నియమించింది ఏపీ ప్రభుత్వం.. ఈ పథకం అమలుపై సాధ్యాసాధ్యాలు మంత్రుల బృందం పరిశీలించింది.. బాలికలతో సహా మహిళలకు ఉచిత ప్రజా రవాణాను అందించే కర్ణాటక శక్తి పథకం అమలును గుర్తించి, ఏపీ ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది.. రవాణా శాఖామంత్రి చైర్మన్ గా, హోంమంత్రి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖామంత్రి సభ్యులుగా, రవాణా శాఖ ప్రధానకార్యదర్శి కమిటీ కన్వీనర్ గా ఉన్నారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పటి వరకు నాయకులు, కార్యకర్తలు ఓపికతో ఉండాలి అని సూచించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ..
నేను కూడా రాయలసీమ బిడ్డనే.. రాయలసీమలో ఫ్యాక్టన్ ఉండేది.. ఫ్యాక్షన్ ను కూకటివేళ్లతో పెకిలించాను అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన.. కేంద్రీయ విద్యాలయ సమీపంలో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.. ప్రజా వేదికలో పీ4 విధానంలో భాగంగా బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో ముఖాముఖి నిర్వహించారు..
మహిళకు శుభవార్త చెబుతూ.. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలు జిల్లా పర్యటనలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, తల్లికి వందనం అమలు చేస్తాం.. ఓ కుటుంబంలో ఎంత అంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది.. అక్రమ అరెస్టులకు అదరం, బెదరం అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు..
అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దవడుగూరు మండలంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈ సందర్భంగా పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై ఫైర్ అయ్యారు.. తాడిపత్రి నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొంది సిట్.. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు.. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు.. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్కేసిరెడ్డికి సన్నిహితులు.. స్కాంలో వచ్చిన…