ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగునుంది... ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేబినెట్లో చర్చిస్తారు... వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.. ఎస్ఐపీబీ ఆమోదించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది..
అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అనకాపల్లి జిల్లా యంత్రాంగంపై విరుచుకుపడ్డా ఆయన.. అనకాపల్లి జిల్లా అవినీతి యంత్రాంగాన్ని ఉరి తీసినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఐసీస్ చేసిన కుట్రను భగ్నం చేశారు తెలుగు రాష్ట్రాల పోలీసులు.. ఇద్దరు విద్యార్థులకు తమ వైపు తిప్పుకొని పేలుళ్లకు పక్కా స్కెచ్ వేశారు.. హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్‌లతో పేలుళ్లకు ప్లాన్ చేశారు.. ఐసీస్ ఉచ్చులో పడి హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు యువకులు.. దీనికోసం ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు సిరాజ్, సమీర్.. ఈ నెల 21, 22వ తేదీల్లో విజయనగరంలో డమ్మీ ప్లాస్టిక్ ప్లాన్ చేశారు..
ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలి.. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ..
నకిలీ పట్టాల పంపిణీ కేసు వ్యవహారంలో వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.. నకిలీ పట్టాల పంపిణీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కీలక ఆదేశాలు జారీ చేసింది నూజివీడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో మహానాడు నిర్వహణకు పనులు మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పదికి ఏడు స్థానాల్లో గెలిచి వైసీపీకి షాక్ ఇచ్చింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ మహానాడు నిర్వహించి తన బల నిరూపణకు సిద్ద మవుతోంది టీడీపీ.. రాయలసీమపై టీడీపీ గురిపెట్టిందా ? అక్కడే మహానాడు నిర్వహణకు టీడీపీ పన్నుతున్న వ్యూహం ఏమిటి ? అనేది ఇప్పుడు చర్చగా మారింది..
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఉగ్రవాదులను లేపేయడమే టార్గెట్‌గా ఆపరేషన్ సిందూర్ ప్రారంభించి పీవోకే, టెర్రరిస్టు శిబిరాలపై విరుచుకుపడింది భారత సైన్యం.. భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినప్పుడు తన తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఉన్నారని స్టార్ క్రికెటర్ మోయిన్ అలీ వెల్లడించాడు.
GVMC డిప్యూటీ మేయర్ పదవిని పోరాడి సాధించింది జనసేన పార్టీ.. గంగవరం కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును డిప్యూటీ మేయర్‌గా ఖరారు చేసింది జనసేన అధిష్టానం.. అయితే, జనసేన డిప్యూటీ మేయర్ పదవిని దక్కించుకున్నా.. ఇప్పుడు కూటమిలో కొత్త వివాదం మొదలైంది..
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను ఒంటరిని చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. సరిహద్దులో ఇటీవలి ఘర్షణల తర్వాత పాకిస్తాన్‌ను ఒంటరిని చేసే ప్రయత్నంలో బీసీసీఐ కఠిన వైఖరి తీసుకున్నట్లు సమాచారం. ఈ చర్యలు రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై దీర్ఘకాలిక, శాశ్వత ప్రభావాన్ని చూపనున్నాయి. భారతదేశం మరియు పాకిస్తాన్ ఇప్పటికే ద్వైపాక్షిక క్రికెట్ ఆడేది లేదని తేల్చేసినప్పటికీ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత రాజకీయ సంబంధాలు రెండు జట్ల మధ్య బహుళ-జట్టు ఈవెంట్లను కూడా ప్రమాదంలో పడేశాయి.