Off The Record: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నేతగా ఉన్నారాయన. అయితే… 2019 ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందంటూ…పెద్ద ఎత్తున ప్రచారం చేసింది వైసీపీ. కానీ… ఇప్పుడు ఆ పార్టీనే అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన పది నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. తాము అధికారంలో […]
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్... మాజీ మంత్రి మేరుగు నాగార్జున. 2019 ఎన్నికల వరకు బాపట్ల జిల్లా వేమూరు నుంచి పోటీ చేస్తూ వస్తున్న నాగార్జునను గత ఎన్నికల్లో సంతనూతలపాడు షిఫ్ట్ చేసింది పార్టీ అధిష్టానం. అక్కడాయన ఓడిపోయారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మేరుగు. అక్కడి వరకు బాగానే ఉన్నా...
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కానీ... ఈ ఏడాదిలో గతంలో ఎన్నడూలేని పరిస్థితి కనిపిస్తోందని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు సెక్రటేరియెట్‌కు వచ్చే విజిటర్స్‌తో పాటు... సొంత పార్టీ కార్యకర్తలు, సిన్సియర్ అని పేరున్న కొందరు అధికారులు సైతం ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారట.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమీక్షలు, సమావేశాలు, ర్యాలీలు.. మధ్యలో జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు.. ఇక, సీఎం చంద్రబాబు రేపు (17వ తేదీ) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.25కి కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు..
మేం ఎవరి జోలికి రాము.. మా జోలికి వస్తే తరిమి కొడుతామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉగ్రవాదంపై పోరాడే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న రిటైర్డ్ IAS అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసశారు సిట్ అధికారులు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు సిట్ అధికారులు..
దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.. ఇప్పటికే ఐదు కేసులో వల్లభనేని వంశీ మోహన్‌కు.. బెయిల్, ముందస్తు బెయిల్లు ఉండగా.. ఇప్పుడు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వంశీకి బెయిల్ వచ్చేసింది.. అయితే, ఈ కేసులో బెయిల్ వచ్చినా.. వేరే కేసులో రిమాండ్ విధించడంతో.. వల్లభనేని వంశీ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది..