Minister Nara Lokesh: నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి నారా లోకేష్.. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్యం పోర్టల్ ని ప్రారంభిస్తున్నాం.. యువత – పరిశ్రమలను అనుసంధానించేలా నైపుణ్యం పోర్టల్ పని చేస్తుందని తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, స్వనీతి ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్టికల్ అంటే ఒక వస్తువు తయారు చేయటానికి ఉపయోగపడే అన్ని కంపెనీలు ఒకే చోట ఉండేలా చూస్తున్నాం అన్నారు.. హారిజాంటల్ అంటే స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్.. దీని కోసమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకుని వస్తున్నాం. ఇవి రెండు అనుసంధానం అయితేనే క్లస్టర్స్ ఏర్పడతాయని తెలిపారు.
Read Also: AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్ కామెంట్లు..
ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ప్రతి సారీ, ఉద్యోగాలు పెరిగాయే కానీ తగ్గలేదు అని గుర్తుచేశారు లోకేష్.. దానికి తగ్గట్టు మనం రెడీగా ఉంటేనే, వచ్చే అవకాశాలు వినియోగించుకోగలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవకాశాలు అందుకోవటానికి రెడీగా ఉందన్నారు.. ఇక, ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వం విధానం. ఒక్కో జిల్లాని ఒక క్లస్టర్ గా తీసుకుని, ఒక్కో రంగంలో పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు.. మహిళలకు ఉద్యోగాలు ఇవ్వటమే కాదు.. వారు ఉండే గ్రామంలో, వారు ఉండే మండలంలోనే వారికి ఉద్యోగాలు ఇచ్చేలా చూడాలి.. యువగళం పాదయాత్రలో, కియాలో పని చేసిన ఒక మహిళతో పరిచయం, నాకు ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని గుర్తుచేసుకున్నారు లోకేష్..
Read Also: Jr NTR: నెపోటిజంపై ఎన్టీఆర్ సంచలనం.. నేను అలాంటోడిని కాదు!
గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్‌లో ‘ నైపుణ్యం’ జాబ్ పోర్టల్‌ను ప్రకటించిన ఐటీ మంత్రి లోకేష్.. సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి నైపుణ్యం పోర్టల్ వస్తుందని.. నిరుద్యోగులు– ఉపాధి కల్పన సంస్థల మధ్య వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు..CDAP, ఇతర నైపుణ్య సంస్థలతో కలిసి టార్గెట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు ఉంటాయి.. ఉద్యోగావకాశాలకు అనుగుణంగా యువతకు స్కిల్ అభివృద్ధి చేస్తాం.. పరిశ్రమల అవసరాలకు తగ్గ శిక్షణను అందించే దిశగా నైపుణ్యం జాబ్ పోర్టల్ పనిచేస్తోందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు..