YS Jagan: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ దాడుల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. అయితే, పులివెందుల వైసీపీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. టీడీపీ దాడిని ఖండించారు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డితోనూ ఫోన్‌లో మాట్లాడారు జగన్.. వీరితో సైదాపురం సురేష్ రెడ్డి (చంటి), అమరేష్ రెడ్డిలతో కూడా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్ధితిపై వాకబు చేశారు.. తమపై టీడీపీ దాడి చేసిన తీరును వివరించారు నేతలు..
Read Also: AB Venkateswara Rao: పోలవరం – బనకచర్లపై ఏబీ వెంకటేశ్వరరావు హాట్ కామెంట్లు..
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు.. దీనిని బలంగా తిప్పికొడదాం.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణం అన్నారు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదన్న సంగతి వారికి అర్ధమైంది.. అందుకే ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు.. ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు.. జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.. వైసీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలి.. పార్టీ అందరికీ అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..