ఏపీ పీజీసెట్-2025 ఫలితాలు విడుదల అయ్యాయి.. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఏపీ పీజీసెట్-2025 ఫలితాలను విడుదల చేశారు మంత్రి నారా లోకేష్.. మొత్తం 31 బ్రాంచ్‌లలో 88.60 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు.. పీజీసెట్ -2025 కోసం 25,688 మంది నమోదు చేసుకోగా.. వారిలో 19,488 మంది అర్హత సాధించారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.. వీరిలో 7463 బాలురు అంటే 87.70 శాతం.. మరియు 12025 మంది బాలికలు అంటే 89.17 శాతం అర్హత సాధించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..
రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం.. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు నిర్వహిస్తాం అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం.. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే, చంద్రబాబు మ్యానిఫెస్టో, బాండ్లు వస్తాయి.
కూటమి ప్రభుత్వానికి ఏడాది గడిచింది.. హనీమూన్ పీరియడ్ ముగిసింది.. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే.. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం అని సూచించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే అందులో మూడు తప్పు ఉంటాయన్న ఆయన.. అవి ఏంటో చెబితే చర్చించి ముందుకు వెళ్దాం అన్నారు.. తప్పును సరిచేసే వరకు పార్టీలో పనిచేయాలని సూచించారు..
కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మహిళల అక్రమ రవాణాపై ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు ఆర్కే రోజా.. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్... మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా..? అని ప్రశ్నించారు.
సింగరేణిలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిస్థితి కొంత కాలంగా దయనీయంగా మారింది. బీఆర్ఎస్ పెద్దల కుటుంబంలో వచ్చిన విభేదాలు సంఘం మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని.. సొంత యూనియన్ నేతలే చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు తాము ఎవరివైపు ఉండాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట టీబీజీకేఎస్ నాయకులు. కవిత, కేటీఆర్‌లో ఎవరికి జై కొడితే... ఎవరు కన్నెర్ర చేస్తారోనని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. ఈ గందరగోళంతో... ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టీబీజీకేఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం…
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. ఈ సామెతను మర్చిపోకుండా ఉంటే.... మీకే మంచిదంటూ... భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి పదేపదే చెబుతున్నారట మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ హస్తం పార్టీ నేతలు. అంతేకాదు... ఏ రోటికాడ ఆ పాట పాడితే... తర్వాత మేం వేసే మ్యూజిక్ వేరేగా ఉంటుందని సీరియస్‌గా వార్నింగ్స్ సైతం ఇస్తున్నట్టు తెలిసింది. ఆ హెచ్చరికల మోత మోగిపోవడంతో... ఎంపీ సాబ్ ఏం చేయలేక చివరికి చాలామంది నాయకుల ఫోన్ నంబర్స్‌ని బ్లాక్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్. బలమైన ప్రతిపక్ష నేత ఉన్నచోట ధీటైన అభ్యర్థి లేదా అధికార పార్టీ పార్టీ పటిష్టంగా ఉండాలని అనుకుంటారు. కానీ... గజ్వేల్ కాంగ్రెస్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీని నడిపే సారథి కూడా ఆయనే. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన నర్సారెడ్డి ఆ తర్వాత గెలుపును చూడలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మళ్లీ పొగలు సెగలుగక్కుతోందా అంటే..... పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనకు తొలి అడుగు సభ జరిగింది. ఈ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం చుట్టూ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది.