ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 570 మంది పిడుగుపాటుతో మృతిచెందగా.. అత్యధికంగా విజయనగరంలో 56 మంది.. శ్రీకాకుళంలో 45, పల్నాడులో 44, నెల్లూరులో 41 మంది చొప్పున పిడుగుపాటు వలన ప్రాణాలు కోల్పోయారు.. ఇక, అత్యల్పంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శైలజానాథ్.. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం అక్రమాలపై ఆధారాలు చూపాలని వైఎస్ జగన్ సవాల్ చేశారు.. దీనిపై ఏమీ సమాధానం చెప్పలేక టీడీపీ నేతలు చేతులు ఎత్తేశారని సెటైర్లు వేశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి ఆరు సీట్లు కూడా రావన్న భయం పట్టుకుంది వైసీపీ నేతలకు అని కామెంట్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కంటే ఏపీ లిక్కర్స్ స్కాం కేసు చాలా పెద్దదని ఆరోపించారు.. మభ్యపెట్టడం మాయ చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమని దుయ్యబట్టారు..
ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతోన్న లిక్కర్ స్కాం కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.. రాష్ట్ర పరిస్థితి, లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న ఆయన.. వైఎస్ జగన్ గత ఐదేళ్లలో చేసిన అప్పులు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతోందన్నారు.. అయినా, బీజేపీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున శ్రీకారం…
ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ల సమావేశంలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్న ఆయన.. భయపెట్టి పాలన చేయాలనుకోవడం మూర్ఖత్వం అన్నారు.. ఇంటింటికీ రేషన్ సరఫరా వాహనాలు రద్దు చేయడం సరికాదని హితవుచెప్పారు..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఐదు కుంకీ ఏనుగులను అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం.. ఈ లోపే వాటి పేర్లను విడుదల చేశారు.. మొత్తం ఐదు కుంకీ ఏనుగులు ఏపీకి రానుండగా.. 1. రంజని, 2. దేవా, 3. కృష్ణా, 4. అభిమన్యు, 5. మహేంద్రగా ప్రకటించారు..
యోగాలో ఏపీ ట్రెండ్ సెటర్గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్కూళ్లు తెరిచిన వెంటనే యోగా ప్రారంభం అవ్వాలన్నారు.. ఒక సిలబస్ గా యోగ ఉండాలన్నారు.. గ్రామ స్థాయిలో కూడా కమిటీలు వేసి యోగాపై ప్రచారం నిర్వహిస్తామన్నారు.. ఒత్తిడి తగ్గించడానికి యోగా ఒక్కటే మార్గం అన్నారు సీఎం చంద్రబాబు.. అంతర్జాతీయ యోగా డేలో 2 కోట్ల మంది భాగస్వామ్యం కావాలన్నారు.. ప్రధాని మోడీ యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని ప్రశంసలు కురిపించారు..
మహిళతో సహజీవనం చేస్తున్నాడు ఓ వ్యక్తి.. ఈ సమయంలో.. సదరు మహిళ కూతురుపై కన్నేశాడు.. దీంతో, నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ ఆమెను వేధించసాగాడు.. మహిళతో సహజీవనం చేస్తూ.. ఆమె కుమార్తెన తనకిచ్చి పెళ్లి చేయాలని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై బాధితురాలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.