Deputy CM Pawan Kalyan: రాఖీ పౌర్ణమి శుభ వేళ.. పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపించారు పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించి మరోసారి మంచి మనస్సు చాటుకున్నారు.. అయితే, ఊహించని రక్షాబంధన్ కానుకకి ధన్యవాదాలు తెలిపారు పిఠాపురం ఆడపడుచులు.. ఇక, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాటలో పార్టీ నాయకులు మరికొందరు రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో రక్షాబంధన్ కానుకలు పంపిణీ చేశారు..
Read Also: NTPC : ఏన్టీపీసీతో తెలంగాణలో భారీ సౌర పెట్టుబడి..!
వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వితంతువులకు సోదరుడిగా నేను ఉన్నాను అనే భరోసా కల్పించడంతో పాటు.. వారిలో ఆత్మస్థైర్యం నింపేలా, ప్రతి ఆడపడుచునూ గౌరవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని స్థానిక నాయకులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కల్యాణ్ తరఫున ఇంటింటికి వెళ్లి.. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ కానుకలు అందించారు జనసైనికులు.. భర్తలను కోల్పోయిన తర్వాతు బంధువులు కూడా చిన్నచూపు చూస్తున్న తమను గౌరవిస్తూ.. అక్కచెల్లెళ్లుగా స్వీకరించి చీరలు పంపించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు సదరు మహిళలు.. పవన్ కల్యాణ్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు..
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపించిన పిఠాపురం MLA, ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఊహించని రక్షాబంధన్ కానుకకి ధన్యవాదాలు తెలిపిన ఆడపడుచులు
అధినేత బాటలో పార్టీ నాయకులు
రాష్ట్రవ్యాప్తంగా… pic.twitter.com/TtciWEQsIX
— JanaSena Party (@JanaSenaParty) August 9, 2025