Kurnool: ప్రేమలో ఉన్నప్పుడు.. ఆ జంట చాటింగ్‌లు, ఫోన్ సంభాషణల్లో మునిగి తేలుతుంది.. ఇక, సమయం దొరికినప్పుడు.. అని అనుకూలించిన సమయంలో.. కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు.. పార్కులు, షికార్లు, సినిమాలు.. ఇలా తిరిగేస్తుంటారు.. అయితే, ఆ సమయంలో ఉన్న ఇబ్బందులతో ఊరి అవతల, ఏ గుడిలోనూ.. ఇంకా ఏదైనా సీక్రెట్ ప్లేస్‌లలో కలుసుకుంటారు.. అయితే, ఈ జాబితాలో మీరు ఉంటే అంతే.. ఎందుకంటే.. ఒంటరిగా.. ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలనే టార్గెట్ చేస్తోంది ఓ ముఠా..
Read Also: JD Vance: జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే అధ్యక్ష పదవి స్వీకరిస్తా..
కర్నూలులో ప్రేమ జంటలు టార్గెట్ గా వసూళ్లు చేస్తున్న ముగ్గురు నిందితులను ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారులో ఏకాంతంగా కనిపించే ప్రేమ జంటలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు, బంగారు దోచుకుంటున్నారు నిందితులు. ఓ యువతి నుంచి బంగారు గొలుసు, నగదు లాక్కొని డబ్బుల కోసం మళ్లీ ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. ముజఫర్ నగర్ కు చెందిన గోర్లగుట్ట నాగేంద్రుడు, ప్రజానగర్ రమేష్, దిన్నెదేవరపాడు కు చెందిన మాలిక్ బాషా అరెస్టు చేశారు. అయితే, వీరికి కొందరు పోలీసులతో కలకలం రేపుతోంది.. నిందితులకు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోమ్ గార్డు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై అంతర్గత విచారణ కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు..