BJP: రాహుల్ గాంధీ ‘‘హగ్’’ కామెంట్స్.. నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలు బయటకు తెచ్చిన బీజేపీ..
- రాహుల్ గాంధీ-సందీప్ దీక్షిత్ హగ్ వివాదం..
- నెహ్రూకు సంబంధించిన పాత ఫొటోలను షేర్ చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే
- ఫొటోలను సందర్భం లేకుండా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని విమర్శించే క్రమంలో, ప్రధాని నరేంద్రమోడీ విదేశాధినేతల్ని ఆలింగనం చేసుకోవడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘విదేశీ నేతల్ని కౌగిలించుకోవడం ఎలాంటి విదేశాంగ విధానం’’ అని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను కౌగిలించుకుని, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఈ ‘‘హగ్’’ వ్యాఖ్యల వ్యవహారం తిరిగి కాంగ్రెస్‌కే ఎదురుదెబ్బగా మారింది. బీజేపీ నేతలు ఇందిరాగాంధీ గతంలో విదేశీ నేతల్ని ఆలింగనం చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తన ఎక్స్ అకౌంట్లో నెహ్రూకు సంబంధించిన పలు పాత ఫొటోలను పోస్ట్ చేశారు. “నా లైబ్రరీలోని నెహ్రూ-గాంధీ కుటుంబానికి సంబంధించిన ఓ పుస్తకంలోని కొన్ని చిత్రాలు” అంటూ ఆయన పేర్కొన్నారు. హ్రూ తన సోదరి విజయలక్ష్మి పండిట్, మేనకోడలు నయనతార సహగల్, అమెరికా మాజీ ప్రథమ మహిళ జాక్వెలిన్ కెన్నెడీతో ఉన్న చిత్రాలు ఉన్నాయి.
Also Read
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
అయితే, దూబే వీనిటి నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలని నేరుగా పేర్కొననప్పటికీ, నెహ్రూ మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు చూపించే ఉద్దేశంతోనే వాటిని పోస్ట్ చేసినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ స్పందిస్తూ.. నెహ్రూ ఫోటోలు అసలు సందర్భం నుంచి విడదీసి తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఫోటోలో ఒక ఫొటోలో నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఆయన చెంపపై ముద్దు పెడుతున్నారని, మరో ఫొటోలో ఆయన మేనకోడలు నయనతార సహగల్ ఉన్నారని ఆమె వివరించారు. 1962 మార్చిలో తీసిన మరో ఫొటోలో హోలీ సందర్భంగా జాక్వెలిన్ కెన్నెడీకి నెహ్రూ రంగులు పూస్తున్నట్లు ఉందని సుప్రియా శ్రినేత్ తెలిపారు.
గురువారం క్రియేటివ్ కాంగ్రెస్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సందీప్ దీక్షిత్‌లు ఆలింగనం చేసుకుని ప్రధాని మోడీపై వ్యంగ్యంగా స్పందించారు. ఈ సమయంలోనే సందీప్ దీక్షిత్, రాహుల్ గాంధీతో ‘‘నన్ను మెలోనీ అనుకోలేదుగా?’’ అని ప్రశ్నించగా, రాహుల్ గాంధీ ‘‘నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు’’ అని బదులిచ్చారు. దీని తర్వాత బీజేపీ ఇందిరా గాంధీ-ఫిడెల్ కాస్ట్రో, ఇందిరా గాంధీ-యాసర్ అరాఫత్ ఫొటోలను కూడా షేర్ చేసింది.
తాజావార్తలు
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!