పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో పిటిషన్ దాఖలైంది… ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట(బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని తన పిటిషన్‌లో ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు.. ముదిరెడ్డిపల్లి వాసి కోస్గి వెంకటయ్య… ప్రాజెక్ట్ నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, కేసును అడ్మిట్ చేసుకున్న ఎన్జీటీ.. కేంద్ర పర్యావరణశాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్‌ఈ, గనులశాఖ, మహబూబ్ నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది… ఇక, పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరిగాయేలేదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రిబ్యునల్.. పర్యావరణ ఉల్లంఘనలపై వాస్తవ పరిస్థితిని తనిఖీ చేసి.. ఆగస్టు 27వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది ఎన్జీటీ.