దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నతమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు.. ప్రస్తుతం అత్యవసర సేవలు మినహా మిగతా విధుల బహిష్కరణ కొనసాగిస్తోంది తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్… అయితే, ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన లేక పోవడంతో.. రేపటి నుంచి అత్యవసర సేవలు కూడా బహిష్కరించనున్నట్టు ప్రకటించారు.. ఈ నెల 10వ తేదీన సమ్మె నోటీసు ఇచ్చారు జూడాలు… పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో పేర్కొన్నారు.. ప్రభుత్వం […]
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.. అలిపిరి నడకమార్గం రెండు నెలల పాటు మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది.. మరమత్తుల కారణంగా రెండు నెలలు పాటు అంటే.. జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు అలిపిరి నడకమార్గం మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.. పైకప్పు నిర్మాణం జరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. 25 కోట్ల రూపాయల వ్యయంతో నడకమార్గంలో పైకప్పు నిస్మిస్తున్నట్టు చెబుతున్నారు టీటీడీ అధికారులు.. అయితే, ప్రత్యామ్నాయంగా […]
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా ఆయుర్వేద పసరు మందు పెద్ద చర్చగా మారింది.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.. ఆయన వేలాది మందికి మందు పంపిణీ చేయారు.. ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే తేల్చేరు అధికారులు.. అయితే, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో.. ఏపీలో కొన్ని […]
కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడ్డారు.. ఇక, వందలాది మంది ప్రాణాలు వదిలారు.. అయితే, తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్.. కరోనాతో ఎవరైనా గుర్తింపు పొందిన జర్నలిస్టు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు.. కరోనా సమయంలో.. జర్నలిస్టులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2000 నుంచి రూ.5 వేలకు పెంచారు.. […]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి కొత్త బాస్ వచ్చేశాడు… 1985 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సుబోధ్ జైస్వాల్ సీబీఐ కొత్త డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఆయన రెండు సంవత్సరాల పాటు ఈ కీలక బాధ్యతల్లో ఉండనున్నారు.. తెల్గి కుంభకోణం దర్యాప్తులో కీలక పాత్ర పోషించి ప్రసిద్ధి చెందిన జైస్వాల్.. సీబీఐ చీఫ్ వరకు ఎదిగారు.. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సిఐఎస్ఎఫ్) చీఫ్ గా విధులు […]
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల […]
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలకు తలొగ్గింది ఫేస్బుక్.. ప్రజలు స్వేచ్ఛగా, సురక్షితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే వేదికగా ఉపయోగపడేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది.. ఫిబ్రవరిలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.. అయతే, మరికొన్ని నిబంధనలపై చర్చ జరుగుతోందని.. ఈ విషయంలో ప్రభుత్వంతో మరిన్ని సమావేశాలు జరగవలసి ఉందని వెల్లడించింది.. కాగా, కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం సామాజిక మాధ్యమాల సంస్థలు చీఫ్ కాంప్లియెన్స్ అండ్ గ్రీవియెన్స్ ఆఫీసర్స్‌ను […]
మహారాష్ట్రలో కరోనా బారినపడి మృతిచెందినవారి సంఖ్య 90 వేలను దాటేసింది.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 24,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 601 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో.. 36,176 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 90,349కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య […]
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రాధాన్యతలను బట్టి ఆయా ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ నిబంధనలు మారుస్తూ వస్తున్నాయి.. తాజాగా, కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా.. అందులో.. చదువు మరియు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి ప్రాధాన్యత జాబితాలో చేర్చేందుకు నిర్ణయించింది కేరళ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.. వివిధ ప్రభుత్వ విభాగాల క్షేత్రస్థాయి సిబ్బందిని, […]