తెలంగాణలో పాదయాత్ర సీజన్ వచ్చేస్తోంది.. కొత్తగా పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తారని తెలుస్తుండగా… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్ర తేదీని ప్రకటించారు.. మరోవైపు.. తాజాగా వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల కూడా.. రేపోమాపో పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చేరారు.. తనపై అభియోగాలు రావడంతో మంత్రి పదవి కోల్పోయిన ఆయన.. టీఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు.. దీంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యం కాగా.. కరోనా నేపథ్యంలో.. ఎన్నికకు కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఎక్కువ గ్యాప్ రాకుండా.. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ఈటల.. ఈ నెల 19వ తేదీ నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల పాదయాత్ర చేయనున్నారు.. మొత్తంగా 22 రోజుల పాటు పాదయాత్ర సాగుతుందంటూ.. రూట్ మ్యాప్ ప్రకటించారు.