ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు.. ఇవాళ్టి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది… జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథమిక ప్రవేశాలు చేసుకోవాల్సిందిగా ఇంటర్‌బోర్డు సూచించింది. అనంతరం ఎస్ఎస్సీ పాస్ సర్టిఫికేట్, టీసీ, స్టడీ సర్టిఫికెట్ల ఆధారంగా ప్రవేశాలను ధ్రువీకరించాలని పేర్కొంది. ఇక, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని.. […]
రేపు సంపూర్ణ చంద్రగ్రహం ఏర్పడనుంది… భారత్‌లో మాత్రం పాక్షికంగా ఉండబోతోంది.. అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించనుండగా… భారత్‌లో కొన్ని ప్రాంతాలకే ఇది పరిమితం కానుంది… పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, ఒడిషా తీర ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులలో కనిపిస్తుందని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) వెల్లడించింది. సంపూర్ణ చంద్ర గ్రహణం అనంతరం ఇది సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహణం భారత్‌లో మధ్యాహ్నం […]
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కారణంగా వాయిదా పడ్డ పరీక్షలను తిరిగి నిర్వహిచేందుకే సిద్ధమవుతోంది సీబీఎస్ఈ బోర్డు.. అయితే పరీక్షల పాటర్న్ కరోనా సంక్షోభం నేపధ్యంలో కాస్త మారనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు విధివిధానాల్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.. అయితే, సీబీఎస్ఈ పరీక్షలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 297 మంది విద్యార్థులు… పరీక్షలు భౌతికంగా నిర్వహించాలని తీసుకున్ననిర్ణయాన్ని క్వాష్ చేయాలని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల మూల్యాంకనంకి గతేడాది అవలంభించిన ప్రత్యామ్నాయ విధానాలను అవలంభించాలి.. ఈ […]
కరోనా కష్టకాలంలోనూ ప్రైవేట్ ఆస్పత్రులు కనికరం చూపడంలేదు.. అందినకాడికి దండుకునే ప్రయత్నమే తప్పితే.. జాలిచూపే పరిస్థితిలేదు.. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ పిల్ వేశారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్న ఆయన.. ఆంద్రప్రదేశ్, […]
10 రోజుల తాత్కాలిక బ్రేక్ తర్వాత తెలంగాణలో ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైందే.. ఇక, ఇదే సమయంలో.. వ్యాక్సినేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్‌వెజ్ మార్కెట్లు, కిరాణా […]
యాస్ తుఫాన్.. తీవ్ర తుఫాన్‌గా మారుతుండడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.. తుఫాన్ ప్రభావం భారీగా ఉండే ప్రాంతాల్లో ముందుగానే అలర్ట్ అయ్యారు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది ఎన్డీఆర్ఎఫ్.. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లోని 14 జిల్లాల పరిధిలో 8,09,830 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.. యాస్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో.. ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. ఇక, యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. 11 […]
మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడినవారికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చినా.. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో నామమాత్రంగానే జరిగింది.. దీనికి వ్యాక్సిన్ల కొరతే ప్రధాన కారణంగా ప్రకటించింది సర్కార్.. అయితే, త్వరలోనే 18 ఏళ్లు పైబడినవారికి కూడా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుంది.. 10 రోజులు దాటిన తర్వాత ఇవాళ్టి నుంచి రెండో డోసును ప్రారంభించింది ప్రభుత్వం.. ఇక, 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు కొవిడ్ టీకాలు వేసేందుకు అన్ని […]
వాట్సాప్ అమలులోకి తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం నో చెప్పిన సంగతి తెలిసిందే.. కొత్త ప్రైవసీ పాలసీలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.. ఈ మేరకు ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు లేఖను రాసింది.. అయితే, కేంద్రం లేఖపై వాట్సాప్ స్పందించింది.. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది.. ఒక ప్రకటనను విడుదల చేసిన వాట్సాప్.. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, యూజర్ల […]