కరోనా కల్లోలం సమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసిన కరోనా మందు.. ఎంతో మందికి నయం చేసిందని చెబుతున్నారు.. అయితే, దీనిపై అధ్యయనం చేసేందుకు మందు పంపిణీని నిలిపివేసింది ప్రభుత్వం.. ఓవైపు దీనిపై అధ్యయనం జరుగుతుండగా.. మరోవైపు.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.. అయితే, ఆ రెండు పిటిషన్ల విచారణకు హైకోర్టు అనుమతించింది.. ఈ నెల 27న విచారణ చేపట్టనుంది […]
యాస్ తుఫాన్ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్… వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.. తుఫాన్ కదలికలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ అవసరమైన చర్యలను తీసుకోవాలన్న సీఎం.. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.. ఇక, శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిస్థితులను వివరించారు.. శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడా జల్లులు తప్ప ప్రస్తుతానికి పెద్దగా ప్రభావం […]
తన తండ్రి, ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు.. భరత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణను ఆరు వారాలకు […]
వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణంరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు లేఖ రాశారు… పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్ వాడుతున్నా.. అయినా, నా కాలి నొప్పి ఇంకా తగ్గలేదన్న ఆయన.. బీపీలో కూడా హెచ్చుతగ్గుదల కనిపిస్తోందని.. నోరు కూడా తరచుగా పొడారిపోతోందని లేఖలో పేర్కొన్నారు.. రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే.. డాక్టర్ల పర్యవేక్షణలో తనకు చికిత్స అందించాలని కోరిన ఎంపీ… అయినా మీరు డిశ్చార్జ్ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్ సమ్మరీలో నా ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయాలని […]
అనందయ్య విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల సంఖ్యను దాచిపెట్టడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బులిటెన్ ప్రకారం 13 మంది చనిపోయినట్లు చూపించారు.. అదేరోజు జిల్లాలో 200 మందికి పైగా కోవిడ్ తో చనిపోయారని ఆరోపించారు.. ప్రస్తుతం ప్రజలు కరోనా గురించి భయపడటం లేదన్న ఆయన.. అమెరికాలో కరోనాతో చనిపోయిన […]
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు వల్ల హాని లేదని ఆయుష్ డైరెక్టర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఆనందయ్య ఆ మందు తయారీలో 18 మూలికలను ఉపయోగిస్తున్నారని, వాటిని దగ్గరుండి పరీక్షించి నిర్ధారించుకున్నామని ఆయన చెప్పారు. అవన్నీ ఇంట్లోనూ మనచుట్టూ దొరికేవేననీ, అయితే వాటి మిశ్రమంలో వచ్చే ప్రభావం ఏమిటో మాత్రం అధ్యయనం చేయాలని తెలిపారు. ఇక, దాన్ని ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, అందుకు సంబంధించిన యాభై గ్రంథాల్లో ఈప్రసక్తి లేకపోవడం ఇందుకు కారణమని స్పష్టం […]
కరోనా కట్టడి చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని, […]
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇప్పటికే ఓసారి జబర్డస్త్ లో లేడీ గెటప్స్ తో పేరు తెచ్చుకున్న హరి అరెస్ట్ అయ్యాడు.. మరోసారి అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.. హరి పలువురు ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు గతంలో నిర్ధారించగా.. మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. శేషాచల అడవుల్లో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. నాగపట్ల, వెస్ట్ బీట్, చీకిమానుకోన దగ్గర 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు.. అయితే, గతంలో అక్రమ రవాణాలో కేసులో […]
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం న్యాయపోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే ఆనందయ్యకు వ్యతిరేకంగా కొంత.. అనుకూలంగా చాలా వరకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుండగా.. వెంటనే ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.. మరోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. కరోనా బాధితులకు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ పేర్కొన్నాడు.. […]