కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం జరిగింది.. మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు […]
ఓవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రజలకు మౌలికసదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇవాళ ఆర్డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్బుక్ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్డబ్ల్యుఎస్ ద్వారా నీటి వసతి కల్పిస్తామన్నారు.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి […]
ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి […]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇప్పుడు లోక్సభ స్పీకర్ చేతిలో ఉంది.. ఓ వైపు వైసీపీ సభ్యులు.. ఆయనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులు చేస్తుంటే.. మరోవైపు.. వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవద్దు అంటూ రఘురామ.. స్పీకర్ను కోరారు.. ఈ పరిణామాలపై స్పందించిన వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పార్లమెంట్ సభ్యత్వం బర్తరఫ్ చేయడం తథ్యం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఆర్టికల్ 10 ప్రకారం చర్యలు తప్పవని.. […]
వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా హాట్ టిపిక్గానే సాగుతోంది.. ప్రభుత్వంపై ఆరోపణలు, కేసులు, అరెస్ట్, జైలు, ఆస్పత్రి, బెయిల్, ఫిర్యాదులు.. ఇలా కొనసాగుతూనే ఉంది.. ఇక, కాసేపటి క్రితమే లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, వైసీపీ వెబ్సైట్లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు. […]
కరోనా మహమ్మారి సమయంలోనూ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగకుండా.. ఇంకా సాధ్యమైనంత ముందే అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. మంగళవారం రోజు వైఎస్ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,48,468 మంది లబ్ధిపొందనున్నారు.. ఇక, ఈ పథకం అమలు చేసేందుకు రూ.248.47 […]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్కూ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో చేరతారని వార్తలు వచ్చినా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఈ చేరికకు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి ఇన్చార్జి తరుణ్చుగ్ తదితరులతో కలసి తర్వాత నడ్డాను కలిసి ఆ లోటు భర్తీ చేసుకోవలసి వచ్చింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎంపీ […]
కరోనా మహమ్మారి కట్టడిలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్ర కీలకమైనది.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయగా.. మరోవైపు.. ఉత్పత్తి కూడా అదే స్థాయిలో జరుగుతోంది.. ఇక, ఈ సమయంలో.. వ్యాక్సిన్ తయారీ చేస్తున్న సంస్థల దగ్గర భారీ భద్రత కల్పిస్తోంది సర్కార్.. ‘కోవాగ్జిన్’ తయారు చేస్తోన్న హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థకి భద్రత కల్పించారు.. హైదరాబాద్ శామీర్పేట్లో ఉన్న భారత్ బయోటెక్ ప్లాంట్ దగ్గర సీఐఎస్ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)తో భద్రత పటిష్టం చేశారు.. పారా మిలిటరీ […]
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలో, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్.. ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయన.. ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రక్తంతో తడిచే బెంగాల్ వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. ఈ భూమిలో హింసకు చోటు లేదన్న ఆయన.. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని కామెంట్ చేశారు. ప్రభుత్వ అధికారులు, సీఎంను […]