హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి శోభా కరాంద్లజే… దేశంలో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి 9 మందిలో ఒకరు మరణిస్తున్నారని వ్యాఖ్యానించిన ఒవైసీ.. ఇక, మహిళలపై వేధింపులు, నేరాలు పెరుగుతున్నాయని.. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల దుస్థితిపై ఆందోళన వ్యక్తంచేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్ చేశారు.. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి.. మహిళలపై వేధింపుల విషయంలో భారత్‌ను ఆఫ్ఘనిస్థాన్‌తో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.. అసదుద్దీన్ ఓవైసీని ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించడం ఉత్తమమని, అక్కడ ఆయన వాళ్ల సమాజానికి, మహిళలకు రక్షణ కల్పిస్తారు అంటూ సెటైర్లు వేశారు కరాంద్లజే.