గుంటూరులో జరిగిన ఘటన మర్చిపోకముందే.. మరో ప్రేమోన్మోదా ఘాతుకానికి పాల్పడ్డాడు.. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గ పూసపాటి రేగ మండలం చౌడువాడలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రేయసిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఉన్మాది చర్యను అడ్డుకునేందుకు యత్నించిన ప్రేయసి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. దీంతో.. వెంటనే ముగ్గురిని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు స్థానికులు… అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్స ఉంది.. మరోవైపు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. రాష్ట్రంలో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు మహిళల భద్రతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. దిశ చట్టాన్ని అమలు చేస్తోంది.. దిశ పోలీస్టేషన్లను ఏర్పాటు చేసింది.. దిశ యాప్‌ను సైతం తెచ్చి.. ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తోంది.