US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!
- కుప్పకూలిన 12 డ్రోన్లు, మూడు F-15 యుద్ధ విమానాలు
- ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ.2.5 బిలియన్లు
- అమెరికాకు దాదాపు రూ.4000 కోట్ల ప్రత్యక్ష నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో జరుగుతున్న పోరులో అగ్రరాజ్యం అమెరికా ఊహించని నష్టాలను చవిచూస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం చావుదెబ్బ తిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 యుద్ధ గమనంలో ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు చెందిన 16 విమానాలు కూలిపోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ఇందులో అత్యాధునిక డ్రోన్‌లతో పాటు కీలకమైన యుద్ధ విమానాలు కూడా ఉండటం గమనార్హం. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కుప్పకూలిన 12 ‘రీపర్’ డ్రోన్‌లు
అమెరికా గర్వంగా చెప్పుకునే MQ-9 రీపర్ డ్రోన్‌లకు ఈ యుద్ధంలో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులకు వెళ్లిన 12 డ్రోన్‌లను ఇరాన్ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఒక్కో రీపర్ డ్రోన్ విలువ సుమారు రూ.2.5 బిలియన్లు (రూ. 250 కోట్లు). 27 గంటల పాటు నిరంతరాయంగా ఎగురుతూ క్షిపణి దాడులు చేయగల ఈ డ్రోన్‌లు కూలిపోవడం అమెరికాకు పెద్ద దెబ్బ అనే చెబుతున్నారు.
మిత్రదేశం పొరపాటు.. ముగ్గురు పైలట్ల మృతి
ఈ యుద్ధంలో అత్యంత దురదృష్టకరమైన ఘటన కువైట్ ఆకాశంలో చోటుచేసుకుంది. ఇరాన్‌పై మిషన్‌లో ఉన్న మూడు F-15 యుద్ధ విమానాలను కువైట్ దళాలు శత్రు విమానాలుగా పొరబడి క్షిపణులతో కూల్చివేశాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అమెరికన్ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గాలిలో ఇంధనాన్ని నింపే KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఇరాక్‌లో కూలిపోవడంతో ఆరుగురు సిబ్బంది మరణించారు.
“యుద్ధం వేగంగా ముగుస్తుంది, అమెరికాకు ఎలాంటి ప్రాణనష్టం జరగదు” అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విమానాల రూపంలోనే అమెరికాకు దాదాపు రూ.4000 కోట్ల ప్రత్యక్ష నష్టం వాటిల్లిందని నివేదికలు చెబుతున్నాయి. డ్రోన్‌లను తిరిగి తయారు చేయవచ్చు కానీ, అనుభవజ్ఞులైన పైలట్లు, KC-135 వంటి కీలక విమానాలను కోల్పోవడం పూడ్చలేని లోటుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగం సందిగ్ధంలో పడినట్లు సమాచారం. దాడులను మరింత తీవ్రతరం చేయడానికి F-35, B-2 బాంబర్లను రంగంలోకి దించుతారా? లేక అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు ప్రారంభిస్తారా? అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వైట్ హౌస్ మాత్రం ఆపరేషన్ కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ, సొంత పార్టీలోనే ట్రంప్ వ్యూహాలపై అసమ్మతి వ్యక్తమవుతోదని తెలుస్తుంది. మొత్తానికి, ఒక చిన్న ఆపరేషన్‌గా భావించిన ఈ పోరు ఇప్పుడు సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన యుద్ధంగా మారుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!