గ్రూప్ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.. పార్టీ కార్యకర్తలకు, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆమె.. గ్రూప్ రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదు… పార్టీ కోసం కష్ట పడే ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అందరూ పని చేయాలని పిలుపునిచ్చిన డీకే అరుణ.. సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులంతా యాక్టివ్‌గా ఉండాలని తెలిపారు.