ఆడియో టేపు లీక్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్ నేత కౌశిక్‌రెడ్డికి మరో షాక్ తగిలింది… టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్… పాడి కౌశిక్‌రెడ్డికి లీగల్‌నోటీసులు పంపారు.. కౌశిక్‌కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్‌నోటీసు జారీ అయ్యాయి… దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనగా… లేకపోతే […]
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.. ఎక్కడి నుంచి.. ఎప్పుడు.. ఎలా.. ఎటాక్ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి… జనారణ్యంలో ఉండే వారినే కాదు.. అభయారణ్యాల్లో సంచరించే అడవుల్లోని అన్నలను కూడా వదలడంలేదు.. ఇప్పటికే పలువురు మావోయిస్టులు కరోనాతో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటిస్తుండదా.. అందులో కొందరు కోవిడ్‌కు బలిఅయినట్టు.. మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా, మావోయిస్టు కీలక నేత వినోద్.. మహమ్మారి బారినపడి మృతిచెందారు.. ఎన్ఐఏకి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వినోద్‌పై రూ.15 లక్షల రివార్డు కూడా […]
ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,763 శాంపిల్స్ పరీక్షించగా.. 2,567 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. తాజా మృతుల్లో గుంటూరులో నలుగురు, చిత్తూరు, నెల్లూరులో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. ఇక, ఇదే […]
హుజురాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.. కానీ, అప్పుడే ఉప ఎన్నికల వాతావరణం వచ్చేసింది.. ఓవైపు.. టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ విజయం సాధిస్తానన్న ధీమాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు.. ఇదే సమయంలో.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన కౌశిక్‌రెడ్డి ఆడియో సంచలనం సృష్టించింది.. ఆ వెంటనే షోకాజ్ నోటీసులు, రాజీనామా, […]
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ కోర్టులపై కూడా పడింది.. ఆన్లైన్ పిటిషన్లు మాత్రమే స్వీకరించడం.. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణ చేయడం లాంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అయితే, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. క్రమంగా అన్ని తెరుచుకుంటున్నాయి.. ఈ తరునంలో.. కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించాలని నిర్ణయించింది హైకోర్టు.. సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.. ఇప్పటి వరకు రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతుండగా.. ఈనెల 19 నుంచి […]
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్… తాజాగా.. తాను వ్యూహాలు అందించిన పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తిరిగి అధికారంలోకి రాగా.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. అయితే, తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన పీకే.. ఆ తర్వాత వరుస భేటీలతో పొలిటికల్ హీట్ పెంచారు.. శరద్ పవార్ లాంటి సీనియర్ రాజకీయ నేతను ఆయన కలవడం.. ఆ తర్వాత ఢిల్లీ వేదికగా.. […]
మనుషులు తప్పిపోయినా ఫిర్యాదు చేసేందుకు వెనుకడు వేసేవారున్నారు.. పీడ విరగడైపోయింది అనుకునేవారూ లేకపోలేదు.. కానీ, తాము గారభంగా పెంచుకున్న పిల్లి తప్పిపోయిందంటూ ఓ జంతు ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించింది.. తప్పిపోయింది పిల్లేకదా అంటూ పోలీసులు లైట్ తీసుకున్నారు.. కేసు నమోదు చేయలేదు.. దీంతో.. తానే ఇలిల్లు తిరుగుతూ పిల్లకోసం వెతికింది.. అయినా ఆ పిల్ల ఆచూకీ దొరకకపోవడంతో.. మీడియాను పిలిచి.. తన గోడు వెల్లబోసుకుంది.. తన పిల్లి ఆచూకీ చెబితే ఏకంగా 30 వేల రూపాయలు రివార్డుగా […]
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.. దాదాపుగా నామినేటెడ్ పదవుల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందని… రేపే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ప్రచారం సాగుతోంది.. బుధవారం రోజు 60 నుంచి 70 వరకు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉండగా.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన, పలు కారణాలతో టికెట్ పొందని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్… ఇప్పటి వరకు ప్రముఖంగా వినిపిస్తున్న కొన్ని పేర్లను పరిశీలిస్తే.. […]
ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరు జిల్లా చింతలపూడి వెళ్లిన ఆయన.. సంగం డెయిరీ కేసులో అరెస్టై.. జైలుకి వెళ్లొచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు.. పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రది.. ఆయన తండ్రి నుండి ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి […]