కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రేపు నిర్మల్ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్‌షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాధులు. వెయ్యి ఉరుల మర్రి సమీపంలో భారీ
బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సభాస్థలిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ఢిల్లీ నుంచి నాందేడ్ రానున్న ఆయన.. అక్కడ నుంచి నిర్మల్ వస్తారు.. వెయ్యి ఉరుల మర్రికి.. నిజాం వ్యతిరేక పోరాటంతో సంబంధం ఉండడంతో అమిత్ షా సభకు అక్కడ పెడుతోంది బీజేపీ. లక్ష పైగా జన సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు.
అమిత్‌షా సభకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నుండి భారీ జన సమీకరణ పై దృష్టి పెట్టింది బీజేపీ.. రాష్ట్ర నలుమూలల నుండి కూడా సభకు కార్యకర్తలు తరలిరానున్నాయి.. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ.. ఎంఐఎం మెప్పు కోసమే టీఆర్ఎస్ సర్కార్ అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపిస్తోంది. తెలంగాణ పర్యటన కోసం రేపు ఉదయం 9.40 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట నుంచి బయల్దేరనున్న అమిత్‌షా.. ఉదయం 11.30 గంటలకు నాందేడ్ చేరుకుంటారు.. 11.30 నుండి 1.30 వరకు సీఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం, ఇంటరాక్షన్ లో పాల్గొంటారు.. అక్కడే లంచ్ చేసుకుని.. మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్మల్ చేరుకుంటారు.. 2.30 నుండి 4.50 వరకు బ్లడ్ డోనేషన్ కార్యక్రమం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు నివాళులు , జాతీయ పతాక ఆవిష్కరణ ఆ తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొంటారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.