చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా లైంగికదాడులు జరుగుతున్న ఘటనలు అనేకం.. కొత్త చట్టాలు వచ్చినా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలకు మాత్రం అడ్డుఅదుపుఉండడం లేదు.. అయితే, హైదరాబాద్‌లో ఓ బాలుడిని లైంగికంగా వేధించిన ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.. రూ.10వేలు జరిమానా కూడా విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే తొమ్మిదేళ్ల బాలుడిని.. పాతికేళ్ల వయస్సు గల ఆయా లైంగిక వేధింపులకు గురి చేసింది.. ఈ ఘటనపై 2017 డిసెంబర్‌లో చాంద్రాయణగుట్ట పీఎస్‌లో బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు..
చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కాస్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో కేర్ టేకర్‌గా పనిచేస్తోంది జ్యోతి అలియాస్ మంజులా అనే మహిళ.. అక్కడే బాధిత బాలుడు చదువుతున్నాడు.. బాలుడు వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో.. అతడితో అనుచితంగా ప్రవర్తించింది ఆ మహిళ.. అసభ్యకరంగా తాకుతూ ఇబ్బంది పెట్టింది.. అయితే, ఆ బాలుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానంటూ ప్రతిఘటించడంతో.. అతని ప్రైవేట్ భాగాలపై సిగరెట్లు మరియు లైటర్‌తో కాల్చి గాయపరిచింది.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడి తండ్రి.. విచారణ సమయంలో, బాధిత బాలుడి సాక్ష్యం, వైద్య రికార్డులు మరియు నేరం జరిగిన ప్రదేశం నుండి స్వాధీనం చేసుకున్న మెటీరియల్స్ ను పరిశీలించిన తర్వాత ఆమెపై పోక్సో చట్టం కింద సెక్షన్లు 324 మరియు 506 కింద ఆమెపై మోపబడిన అభియోగాలను పరిశీలించి దోషిగా నిర్ధారించింది కోర్టు. ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.10వేలు జరిమానాగా విధించింది కోర్టు.