ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఎన్నికలపై హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.. మరోవైపు.. వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయినట్టు సమాచారం.. ఇప్పటి నుంచే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల కోసం వచ్చే ఏడాది నుంచి అంతా రంగంలోకి దిగాలని కూడా పీకే టీమ్‌ను ఆదేశించినట్టు సమాచారం..
వచ్చే ఏడాది నుంచి ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ బృందం రంగంలోకి దిగనున్నట్టు మంత్రులతో సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. ఈలోగా క్షేత్రస్థాయిలో ఎన్నికలకు అనుగుణంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలని మంత్రులను ఆదేశించారు వైసీపీ అధినేత.. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం.. ఎన్నికల టీమ్ ను సిద్ధం చేసుకునే దిశగా సన్నాహాలు జరుగుతున్నట్టుగా వెల్లడించినట్టు తెలుస్తోంది.. ప్రస్తుత కేబినెట్‌లో 80 శాతం మందిని ఎన్నికల టీమ్ కోసం వినియోగించుకోనున్నట్లు సంకేతాలు ఇచ్చారు సీఎం.. ఇక, క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులను ఆదేశించారు సీఎం జగన్.. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు.. ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేలా క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టాలని ఆదేశించారు. ఏదేమైనా.. ఇప్పుడే ఎన్నికలపై సీఎం వైఎస్ జగన్ ఫోకస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.