తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ ముదురుతోంది.. ఓ వైపు మాటల యుద్ధం.. మరోవైపు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది.. ఇప్పుడు కృష్ణజలాల వివాదంపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఉంది ఏపీ సర్కార్… సుప్రీంలో పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, తక్షణమే […]
మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు. […]
ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కరోనాపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. మణిపూర్, అసోంతో పాటు మిగతా రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం ఇప్పటికే ఈ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. గత వారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను పాటించేలా […]
దర్భంగా పేలుళ్ల కేసులో విచారణ ముమ్మరం చేసింది ఎన్ఐఏ.. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ బృందం బీహార్ వెళ్లింది. దర్భంగా రైల్వేస్టేషన్ చేరుకుని… విచారణ చేసింది. పార్శిల్ బ్లాస్టింగ్ కేసులో… ప్రత్యక్ష సాక్ష్యుల స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. వారు ఇచ్చిన సమాచారంతో… బ్లాస్టింగ్ ఉన్న వారి గుట్టును బయటకు లాగేందుకు ప్రయత్నిస్తోంది ఎన్ఐఏ.. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పలుచోట్ల సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ.. ఐదుగురిని అరెస్ట్ చేసింది. అనంత్‌నాగ్‌లో నలుగురు, శ్రీనగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి […]
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం కేసులు భారీగా నమోదు అవుతూ వచ్చాయి.. ప్రస్తుతం అక్కడ కూడా కేసులు తగ్గుతూ వస్తున్నాయి… కేరళ సర్కార్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 7,798 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో వంద మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. తాజా కేసులు కలుపుకొని పాజిటివ్ కేసుల సంఖ్య 30,73,134కు చేరుకోగా.. ఇప్పటి వరకు 14,686 మంది […]
కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంత కాదు.. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ నుంచి కాస్త పరిస్థితి కుదుటపడుతుండగా.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. తాజాగా థర్డ్ వేవ్‌పై వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ).. కరోనా థర్డ్ వేవ్ తప్పదని.. అది కూడా త్వరలోనే రాబోతోందని ఐఎంఏ హెచ్చరించింది. ఓవైపు ఇలాంటి పరిస్థితులున్నా.. అధికారులు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఏంటి? అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది ఐఎంఏ.. ఇప్పటికే ఫస్ట్ వేవ్, […]
ఆ మధ్య వరంగల్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల పేర్లను మార్చనున్నట్టు ప్రకటించారు.. దానికి అనుగుణంగా.. ఇవాళ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం.. వరంగల్ రూరల్ జిల్లాను హనుమకొండ జిల్లాగా.. వరంగల్ అర్బన్ జిల్లాను వరంగల్ జిల్లాగా మారుస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు ఇచ్చింది. హనుమకొండ జిల్లాలోకి వరంగల్ జిల్లాలోని మండలాలు… వరంగల్ జిల్లాలోని మండలాలు హనుమకొండ జిల్లాలలోకి… […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది… వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 696 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఆరుగురు కరోనా బాధితులు మృతిచెందగా… ఇదే సమయంలో 858 మంది బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,32,379కు చేరుకోగా.. ఇందులో 6,18,496 మంది బాధితులు కోలుకున్నారు.. ఇక, కోవిడ్ […]
చంద్రబాబు రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని.. చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్ […]
కరోనా మహమ్మారి కారణంగా కొన్ని పరీక్షలు రద్దు అయితే.. మరికొన్ని పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ వచ్చింది ప్రభుత్వం.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడం వలన.. పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని వెల్లడించారు.. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని.. […]