తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి తెరదించాలన్న ఉద్దేశంతో గెజిట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, ఆ గెజిట్లపై తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో.. జలసౌధలో ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్… కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ పై అధ్యయనం కొనసాగుతోందని వెల్లడించిన ఆయన.. పాలనాపరమైన, సాంకేతికపరమైన, న్యాయపరమైన అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు కృష్ణా జలాల్లో న్యాయపరమైన […]
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని నివేదికలు రాగా.. పెగాసస్ హ్యాకింగ్ నివేదికపై ఇవాళ పార్లమెంట్‌లోనూ దుమారం రేగింది.. అయితే ఆ స్పైర్‌వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ […]
హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి హైదరాబాద్ వచ్చిన జాంబియాకు చెందిన ఓ ప్రయాణికుడి దగ్గర రూ.25 కోట్ల విలువ చేసే 3.2 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు.. సినీ పక్కీలో మాదకద్రవ్యాలను మలద్వారంలో తరలిస్తుండగా.. కేటుగాళ్ల గుట్టురట్టు చేశారు.. ఇక, 3.2 కిలోల హెరెయిన్‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ మధ్య తరచూ దేశంలోని అంతర్జాతీయ […]
ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు పెంచాయి.. దీంతో.. అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… విపక్షాల కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు హయాంలో కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చిందని.. గ్రామ సచివాలయాల్లోనే 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని.. ఇవి కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.. ప్రభుత్వ […]
అమరావతి భూముల వివాదంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను ఆంధ్రప్రదేశ్ మైకోర్టు కొట్టివేయగా… హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసింది… ఇక, ఈ వ్యవహారంలో ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు… తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది… ఇక, ఏపీ ప్రభుత్వ ఎస్.ఎల్.పి ని కోట్టివేసింది సుప్రీంకోర్టు.. దీంతో.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టు […]
పార్లమెంట్ వర్షాకాల ఇవాళే ప్రారంభం అయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనతో మొదటిరోజూ ఉభసభలు వాయిదా పడ్డాయి.. ఇక, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఉభయసభలకు చెందిన ఫ్లోర్ లీడర్లతో రేపు సమావేశం కానున్నారు. లోక్‌సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారని తెలుస్తోంది.. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ పాలసీపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.. అదేవిధంగా దేశంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు.. ప్రజా సంఘాలు వీరికి మద్దతుగా నిలుస్తుండగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. నిరుద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని ప్రకటించారు.. పవన్‌ను కలిసిన నిరుద్యోగ యువత వారి ఆవేదనకు ఆయనకు తెలియజేశారు.. దీంతో, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది జనసేన పార్టీ.. రేపు ఏపీలోని అన్ని ఎంప్లాయిమెంట్ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసైనికులకు పిలుపునిస్త ఓ […]
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే రాజ్యసభలో ప్రత్యేక హోదాపై ఆందోళనకు దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇవాళ రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లారు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని ఆమోదిస్తూ మార్చి 11, 2014న కేంద్ర కేబినెట్ చేసిన తీర్మానం ఏడేళ్లు కావస్తున్నా అమలుకు నోచుకోనందున ఈ రోజు ఇతర కార్యకలాపాలను సస్పెండ్ […]
పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్ సైట్‌కు వెళ్లారు.. స్పిల్వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 91,594 శాంపిల్స్ పరీక్షించగా… 2,672 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు మృతిచెందారు. చిత్తూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున మృతిచెందగా.. అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 2,467 కోవిడ్ […]