ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,720 శాంపిల్స్ పరీక్షించగా.. 1,365 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఎనిమిది మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇక, ఇదే సమయంలో 1,466 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్..
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,78,70,218గా ఉండగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,42,073కు పెరిగింది.. ఇక, రికవరీ కేసుల సంఖ్య 20,14,180కి చేరగా.. ఇప్పటి వరకు మృతిచెందిన కోవిడ్ బాధితుల సంఖ్య 14,097గా ఉంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 13,796 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా.. చిత్తూరు జిల్లాలో 212, తూర్పు గోదావరి జిల్లాలో 210 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.