కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… ప్రభుత్వ ఆస్పత్రులు, వ్యాక్సినేషన్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుండగా.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం డబ్బులు చెల్లించి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి.. అయితే, తమిళనాడు ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది… ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది.. ఈ ప్రక్రియను సోమవారం నుంచి ప్రారంభించారు.. ఉచిత టీకా డ్రైవ్‌ను విస్తరించేందుకు మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద నిధులకు సహాయం చేయమని కార్పొరేట్లను […]
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గినట్టే కనిపించినా.. మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే, తాజా బులెటిన్ ప్రకారం.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 29,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 415 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 42,363 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. […]
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.. ఇక, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ దీక్షల పేరుతో వరుసగా దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ఇకపై.. ప్రతీ మంగళవారం దీక్షలు చేయనున్నట్టు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది.. ఇక, ఇవాళ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ […]
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో కల్లోలమే సృష్టించింది.. కొత్త రికార్డుల సృష్టించాయి పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య… క్రమంగా కేసులు తగ్గినట్టే తగ్గినా.. పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.. కానీ, మరోమారు విజృంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలే ఇందుకు సూచికలుగా నిలుస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య రెండింతలయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నాడు పాజిటివిటీ రేటు 3.4 శాతంగా నమోదు కాగా.. అంతకుమందు వారంలో ఇది […]
ఇప్పటికే శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ-20 సిరీస్‌పై కన్నేసింది.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో విక్టరీ కొట్టిన భారత జట్టు.. ఇవాళ రెండో మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది.. తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. లంకేయులు అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యారు. అయితే, మరో మ్యాచ్ మిగిలుండగానే శిఖర్ ధావన్ సేన రెండో మ్యాచ్‌లో నెగ్గి టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. […]
ఐదు రోజుల పర్యటన కోసం సోమవారం హస్తిన చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. బిజీబిజీగా గపడనున్నారు.. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బెంగాల్ సీఎంగా ముచ్చటగా మూడో సారి విజయం సాధించిన దీదీ.. ఎన్నికలు […]
కరోనా డెల్టా వేరియంట్ మరింత డేంజర్‌గా మారుతోంది. డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తికి దగ్గరగా వెళ్లినా సరే.. ఇన్ఫెక్షన్ సోకుతుందని తేల్చారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఈ వేరియంట్ సోకుంది. కరోనా వ్యాప్తి ప్రారంభంలో వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి వెళ్లినప్పటినుంచి ఇన్ఫెక్షన్ బారిన పడటానికి మధ్య సరాసరి ఆరు రోజుల వ్యవధి ఉండేది. కానీ డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయిందంటున్నారు శాస్త్రవేత్తలు. టీకాలు తీసుకున్న వారికి సైతం డెల్టా వేరియంట్ […]
ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉద్రిక్తంగా మారాయి. అసోం, మిజోరం బోర్డర్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఎస్పీ సహా 60 మందికి పైగా గాయపడ్డారు. ఇరువైపులా ఆస్తులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. గతేడాది ఆగస్టులో, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ సరిహద్దు సమస్యపై ఘర్షణలు జరిగాయి. అవి పునరావృతమయ్యాయి. సరిహద్దులోని 8 వ్యవసాయ పాకలను గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టడమే తాజా ఘర్షణలకు కారణంగా […]
మేషం : ఈ రాశివారు ఇవాళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. నూనె, మిర్చి, మినుము వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఇంటి కోసం విలువైన ఫర్నీచర్ సమకూర్చుకంటారు. వృషభం : ఈ రోజు మీపై ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిథునం : ఈ రోజు ఈ […]