భారత్‌లో బ్యాంకులకు రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది.. మాల్యా దివాలా తీసినట్టు ప్రకటించింది లండన్ కోర్టు… మాల్యా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దానికి అనుమతి నిరాకరించారు. అయితే, మాల్యా ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మాల్యా దివాళా తీసినట్లు తీర్పు ఇస్తున్నాను అంటూ జడ్జి మైఖేల్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు.. ఇక మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు సంబంధించిన […]
ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి […]
యడియురప్ప.. కర్నాటకలో బీజేపీకి బలమైన నాయకుడు..! లింగాయత్ వర్గానికి చెందిన యడియురప్ప.. బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ నుంచి బయటికి వచ్చినా.. ఆయన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అలాంటి యడియురప్పకు జులై నెల అంటే టెన్షన్ పట్టుకుంటోంది. ఆయన రెండుసార్లు ఇదే నెలలో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008లో యడియురప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ పదవిలో ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మూడేళ్లకే ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంటే 2011 […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ… […]
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీకి బైబై చెప్పిన తర్వాత.. ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో… తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు.. బీజేపీలో పరిస్థితిలు నాకు నచ్చలేదన్న పెద్దిరెడ్డి… కానీ, ఆ పరిణామాలపై విమర్శలు చేయదల్చుకోలేదన్నారు.. అయితే, ఈటల రాజేందర్.. బీజేపీలో చేరిన విషయంలో నాకు గౌరవం ఇవ్వలేదని కామెంట్ చేశారు.. ఇక, […]
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,14,105 శాంపిల్స్ పరీక్షించగా.. 638 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు చనిపోయారు.. ఇదే మయంలో.. 715 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,41,791కి పెరగగా.. రికవరీ కేసులు 6,28,679కు చేరాయి.. ఇక, ఇప్పటి […]
కట్టెలు ఎత్తిన చేతులతోనే భారత్‌కు వెండి పతకాన్ని సాధించి పెట్టారు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను.. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి.. భారత్ పతకాల ఖాతా తెరిచారామె.. ఇక, ఆమెకు బంగారం పతకం కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి.. కానీ, బంగారు పతకాన్ని అందుకున్న చైనీ క్రీడాకారిణి డోపింగ్ టెస్ట్‌లో విఫలం అయితేనే అదిసాధ్యం అవుతుంది. మరోవైపు.. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్న చానుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.. ఇక, ఇటీవల ఆమెకు కోటి రూపాయల […]
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి.. భారత్‌ను శుభారంభాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి… 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోగా.. ఈ ఈవెంట్లో చైనా వెయిట్‌లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ, ఆమెకు యాంటీ డోపింగ్ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు.. ఇప్పటికే మీరాబాయి చాను.. టోక్యో నుంచి భారత్‌కు చేరుకోగా… టోక్యోలోనే ఉండాల్సిందిగా హౌను ఆదేశించారు ఒలింపిక్స్ నిర్వహకులు. ఈ […]
పెగాసస్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ రగడ కుదిపేస్తోంది.. ప్రతిపక్షాల ఆందోళనతో సమావేశాలు వాయిదా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీనియర్ న్యాయమూర్తి మదన్ భీంరావ్ లోకూర్, కోల్కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్యల నేతృత్వంలో హ్యాకింగ్, నిఘాలపై దర్యాప్తునకు ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అక్రమ హ్యాకింగ్, నిఘా, మొబైల్ ఫోన్ల […]
రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్‌కు వెళ్లేవారికి.. రైళ్లలో వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తాత్కాలికంగా పెంచిన ప్లాట్‌ఫారమ్ టికెట్ ధరను సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా మహమ్మారి కారణంగా గతంలో నిలిపేసిన ప్లాట్‌ఫారమ్ టికెట్ల జారీ మళ్లీ పునరుద్ధరించారు అధికారులు… జోన్ నెట్‌వర్క్‌లో అన్రిజర్వ్డ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో […]