ఆంధ్రప్రదేశ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్ పెట్టేందుకు, మిడిల్ క్లాస్‌కు స్వయంగా లేఅవుట్లను వేయనుంది.. రాష్ట్రవ్యాప్తంగా మధ్య ఆదాయ వర్గాల కోసం నిర్దేశించిన ఎంఐజీ లే అవుట్లను వేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించని భూముల్ని అప్పగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్లకు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించి నిరుపయోగంగా ఉన్న భూముల్ని పురపాలక శాఖకు తిరిగి అప్పగించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. మధ్యాదాయ […]
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు బీఎస్ యడియూరప్ప… రేపేమాపో కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.. మరోవైపు.. యడియూరప్ప రాజీనామా చేసిన సమయంలో.. కొత్త సీఎంను ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిందిగా గవర్నర్ కోరారు… ఇక, చివరినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పారు యడియూరప్ప.. ఉద్యోగుల డీఏను 10.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో ఉద్యోగుల మూలవేతనంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది.. ప్రస్తుతం కర్నాటకలో ప్రభుత్వ […]
పెట్రోల్, డీజిల్ ధరలు.. రోజురోజుకీ సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. ఇక, జీఎస్టీ కౌన్సిల్ సమవేశం జరిగిన ప్రతీసారి.. పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతూనే ఉంది.. కానీ, ఆ ఉద్దేశమే లేదనేది తాజా ప్రకటనతో స్పష్టం అయ్యింది.. ఎందుకుంటే.. ఆ దిశగా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ.. […]
కర్నాటక ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయడంతో.. కొత్త సీఎం ఎంపికపై కసరత్తు ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం.. యడియూరప్ప వారసుడి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్‌రెడ్డికి అప్పగించారు.. సీఎం ఎంపిక ప్రక్రియ ఇంచార్జీలుగా ఇద్దరు కేంద్రమంత్రులను నియమించడంతో.. ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరారు.. ఇవాళ సాయంత్రం కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపనున్నారు ఇరువురు నేతలు.. సాయంత్రం 7 గంటలకు బీజేఎల్పీ సమావేశం కానుంది. ఇక, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిపై […]
టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకానికి పంచ్ దూరంలో ఉంది ఇండియా.. ఇవాళ 69 కిలోల విభాగంలో జరిగిన బాక్సింగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సంచలనం సృష్టించింది.. జర్మన్ బాక్సర్ నడైన్ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి.. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.. ఇక, క్వార్టర్స్‌లో గెలిస్తే.. ఆమె కనీసం కాంస్య పతకం అందుకోనుంది.. ఇవాళ భారత్ నుంచి పోటీపడిన ఏకైక బాక్సర్ లవ్లీనా మాత్రమే కాగా.. విజయం సాధించి పతకంపై ఆశలు చిగురించేలా చేసిందామే.. […]
కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది.. తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు అయితే, ప్రస్తుత నీటిమట్టం 1631.45 అడుగులకు చేరింది. ఇక, పూర్తిస్థాయి నీటినిల్వ 100 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 95 టీఎంసీలు ఉన్నాయి.. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 1.63 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 33 గేట్లు ఎత్తి 1.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. దీంతో.. దిగువప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు మొదటి […]
వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.. ఆయన వీఆర్ఎస్ తీసుకన్న తర్వాత.. టీఆర్ఎస్లో చేరతారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి రాగానే వాటిని ఖండించారు.. ఇక, ఆ తర్వాత ఆర్ఎస్పీ.. బీఎస్పీవైపు అడుగులు వేస్తున్నారని.. ఆ పార్టీలో చేరి.. తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారనే చర్చసాగింది.. ఆ వార్తలను నిజమేనని తేలిపోయింది.. తాజాగా మీడియాతోమాట్లాడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. కాన్షీరాం అడుగుజాడల్లో […]
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ గాంధీ దృష్టిసారించారు.. రాహుల్‌తో సమావేశమైన ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి.. బలోపేతానాకి తీసుకోవాల్సిన చర్చలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏపీలో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం.. రాష్ట్రానికి చెందిన పలు సీనియర్లకు జాతీయస్థాయులో పార్టీలో బాధ్యతలు అప్పచెప్పాలన్న ఆలోచనలో రాహుల్ ఉన్నారని చెబుతున్నారు.. ఏపీలో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులను మళ్లీ కదిలించేందుకు.. […]
రాజీనామా వ్యవహారంపై వస్తున్న వార్తలను ఖండిస్తూనే వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. చివరకు రాజీనామా చేశారు.. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే, కొత్త సీఎంను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను కోరారు గవర్నర్.. ఇక, యడియూరప్ప వారసుడు ఎవరు? కర్ణాటక సీఎం పీఠంపై కూర్చోబోతున్న కొత్త వ్యక్తి ఎవరు అనేదానిపై బీజేపీ అధిష్టానం తీవ్రమైన కసరత్తు చేస్తోంది.. ఇదే సమయంలో.. యడియూరప్పకు బీజేపీ అధిష్టానం […]