గుంటూరు సిటీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై కేసు నమోదు చేసింది సీబీఐ… పొగాకు కొనుగోలు కంపెనీ పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రూ.45 కోట్ల రుణాలు తీసుకున్న వెంకట్రావు.. రూ.19 కోట్ల రుణాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు అభియోగాలున్నాయి… బ్యాంకు ఫిర్యాదుతో తాడిశెట్టి వెంకట్రావు, మురళీమోహన్‌పై కేసు నమోదు చేసింది సీబీఐ.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రావు ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.. కాగా, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో.. […]
తెలంగాణ భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది… మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి.. బీజేపీకి రాజీనామా చేశారు.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన.. ఈటల.. పార్టీలో చేరితే ప్రకంపనలు తప్పవని హెచ్చరించారు. అయినా, బీజేపీ.. ఈటలకు ఆహ్వానం పలకడంపై అసంతృప్తిఉన్న ఆయన.. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు.. బీజేపీ నుంచి హుజురాబాద్ స్థానాన్ని ఆశించారు పెద్దిరెడ్డి.. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల […]
ప్రకృతి అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. అందుకే తరచూ వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ జర్నీలోని అనుభవాలను, అనుభూతులను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. కానీ, తాను ట్వీట్ చేసిన అరగంటలోపే ఆ ప్రకృతి ప్రకోపానికే బలిఅవుతానని ఊహించి ఉండదు.. ఇప్పుడా ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప శర్మ.. ఈ సృష్టిలోని ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు.. […]
కరోనా మహమ్మారి దెబ్బకు స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత.. అక్కడక్కడ మళ్లీ తెరిచే ప్రయత్నాలు చేసినా.. మళ్లీ కోవిడ్ పంజా విసరడంతో.. అంతా వెనక్కి తగ్గారు.. ఇక, కోవిడ్ సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ స్కూళ్లు తెరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుందని.. టీచర్లు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసి.. మళ్లీ భౌతిక తరగతులు ప్రారంభించుకోవచ్చు అనే […]
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గిందనే చెప్పాలి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,672 శాంపిల్స్ పరీక్షిచంగా… 1,627మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 17 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మృతిచెందారు.. మరోవైపు ఇదే […]
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో స్పీడ్ పెంచింది సీబీఐ.. ఇప్పటికే వాచ్మెన్ రంగయ్య వాంగ్మూలం ఇవ్వడంతో.. అది ఈ కేసులు చాలా కీలకంగా మారింది.. అయితే, ఇవాళ ఈ కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్యను పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.. ఇప్పటికే పలు మార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు దస్తగిరి… ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. మధ్యాహ్నం […]
భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయినా.. సరిహద్దుల్లో.. నిర్మాణాలు, బలగాల మోహరింపు.. దీనికి ధీటుగా భారత్ స్పందించడం.. ఇలా వ్యవహారం సాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో 12వ రౌండ్ చర్చలకు సిద్ధమయ్యాయి భారత్-చైనా.. ఈ నెల 31వ తేదీన ఈ సమావేశం జరగనుంది.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరుగనున్న ఈ సమావేశంలో గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, డెప్సాంగ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడంపై […]
‘నాడు నేడు’ సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ రాష్ట్రం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్… మన బడి, నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించేకునేందుకు అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్.. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను వినియోగించింది ఏపీ ప్రభుత్వం.. ఇక, టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు నిరభ్యంతర […]
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిచింది… ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోటర్ల ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. దీని ప్రభావము వలన 28 జూలై 2021 తేదీన ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం […]
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి… 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య.. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ.. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆర్. కృష్ణయ్య.. బీసీల పట్ల కేంద్ర వైఖరిని ఖండిస్తున్నాం.. బీసీ బిల్లు ప్రవేశ పెట్టకపోతే లక్ష మందితో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.. […]