అక్టోబర్ 22, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారికి నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమిస్తే అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల విషయంలో ముందు చూపు ఎంతో అవసరం. ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు రాజకీయ నాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు. ముఖ్యుల పట్ల ఆరాధన పెరగగలదు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
Also Read
మిథునం : ఈ రోజు మీ బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధన సహాయాన్ని అర్థిస్తారు. మీ కుటుంబీకుల గురించి గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనువుతారు.
కర్కాటకం : ఈ రోజు ఈరాశివారికి వాతావరణంలోని మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు ఆర్జిస్తారు. పత్రికా సంస్థలో వారికి పనిభారం అధికమవుతుంది. తొందరపాటు నిర్ణయాలవల్ల అనర్థాలు తప్పవు. క్రీడా రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనువుతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి సదావకాశాలు లభిస్తాయి. బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. రాజకీయ నాయకులు సభలు, సన్మానాల్లో పాల్గొంటారు.
కన్య : ఈ రోజు ఈ రాశివారు వారి కుటుంబీకుల గురించి గొప్ప పథకాలు వేస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది.
తుల : ఈ రోజు మీరు ఆర్థిక వ్యవహారాల్లో ఆచి, తూచి వ్యవహరిస్తారు. రవాణా రంగంలో వారికి సంతృప్తి కానరాగలదు. దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి బంధువుల గురించి ప్రియమైన వార్తలు వినాలనుకుంటారు.
వృశ్చికం : ఈ రోజు బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. ఇసుక, క్వారీ, బిల్డింగ్ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో చుకుకుగా పాల్గొంటారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు.. పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేయటంలో సహోద్యోగులు సహకరిస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహా తీసుకోవటం ఉత్తమం. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. ఉద్యోగస్తులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మంచిది.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకస్మికంగా బిల్లులు, ఫీజులు చెల్లిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!