కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనా నుంచి అక్రమంగా అన్ని దేశాలకు ఆ మహమ్మారి విస్తరించింది.. ఆ తర్వాత అన్ని ప్రయాణాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ఇక, అంతర్జాతీయ విమాన సర్వీసులు.. ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కొన్ని ఎంపిక చేసిన సర్వీసులు, ఎంపిక చేసిన రూట్లలోనే నడుస్తున్నా.. రెగ్యులర్ సర్వీసుల మాత్రం అందుబాటులోకి వచ్చిందిలేదు. ఇక, అంతర్జాతీయ విమాన సర్వీసుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చితో వచ్చిపోయే… అంతర్జాతీయ విమానాలను వారానికి 408కి కుదించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ప్రకటించింది. అయితే… వేసవిలో ఈ విమానాల సంఖ్య 644గా ఉంది. కరోనా మహమ్మారి రాజ్యమేలిన గతేడాది కంటే ఇది 21.1 శాతం తగ్గింది. కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతున్న వేళ… చైనా నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.