నన్ను ఎలా అడ్డుకుంటారు..? కౌశిక్‌రెడ్డి కౌంటర్ ఎటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కడక్కడ కొన్ని ఘటనలు మినహా హుజురాబాద్‌లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.. అయితే, బీజేపీ శ్రేణులు తనను అడ్డుకోవడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డి… వీణవంక మండలం గణుముక్కలలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చారు కౌశిక్‌రెడ్డి.. అయితే, పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ ఆయనపై మండిపడ్డ బీజేపీ నేతలు.. అసలు కౌశిక్‌రెడ్డికి ఇక్కడ పనేంటి అంటూ ఫైర్ అయ్యారు. కౌశిక్‌తో వాగ్వాదానికి దిగారు… ఇక, పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. తాను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నాను.. నాకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉంది.. నన్ను అడ్డుకోవడానికి బీజేపీ వాళ్లకు ఉన్న అధికారం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. బీజేపీ వాళ్లు నన్ను ఎలా అడ్డకుంటారు? ఎందుకు అడ్డుకుంటారు? అని ప్రశ్నించిన ఆయన.. ఇది కేవలం ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్‌తో చేస్తున్న పనిగా కౌంటర్ ఎటాక్ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలను ఓడించి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి.
Also Read
- Tags
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!