అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ అంతా బీజేపీ వైపు చూశారు.. ఆ తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.. అదే పశ్చిమబెంగాల్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానేనా అంటూ సాగిన సమరంలో.. మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.. మళ్లీ బెంగాల్ సీఎం పీఠాన్ని అధిరోహించారు మమతా బెనర్జీ.. అయితే, ఎన్నికలకు ముందు టీఎంసీ లీడర్లను ప్రలోభాలకు గురిచేసి.. బీజేపీ కొంతమందిని ఆ పార్టీలో చేర్చుకున్నాయనే విమర్శలు ఉండగా.. దీదీ మళ్లీ సీఎం అయ్యాక.. టీఎంసీలో చేరేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి ఇప్పటికే చేరగా.. తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ.. బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 2న బీజేపీలో చేరిన ఆమె.. ఇప్పుడు రాజీనామా చేశారు.
Read Also: టీఆర్‌ఎస్ ధర్నాకు అనుమతి.. వైఎస్ షర్మిల దీక్షకు నో పర్మిషన్..
పశ్చిమ బెంగాల్ అభివృద్ధిపై బీజేపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని.. కనీస ప్రణాళికలు కూడా లేవని ఆరోపించిన స్రవంతి ఛటర్టీ.. అందుకే తాను బీజేపీకి రాజానామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక, ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు టీఎంసీలో చేరిన నేపథ్యంలో.. ఇప్పుడు స్రవంతి ఛటర్జీ కూడీ తృణమూల్ పార్టీలోనే చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బెహలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన స్రవంతి ఛటర్జీ.. ఆ ఎన్నికల్లో టీఎంసీ కీలక నేత పార్ధ ఛటర్జీ చేతిలో ఓటమిపాలయ్యారు.