వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్‌కు రప్పించింది కేంద్ర ప్రభుత్వం.. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. వదేళ్ల క్రితం చోరీకి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం.. చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇక, మాత అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈనెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణా దేవి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. యూపీ సీఎం యోగి చేతుల మీదుగా ఈ విగ్రహం పునఃప్రతిష్ట చేయనున్నారు..
Read Also: చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
ఇక, 100 ఏళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి యూపీ ప్రభుత్వానికి అందించడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. కెనడా ప్రభుత్వంతో అనేక సంవత్సరాలు సంప్రదింపులు జరిపి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చామని వెల్లడించారు.. మరికొద్ది రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సైతం విదేశాల్లో ఉన్న విగ్రహాలు అందజేయనున్నట్టు తెలిపారు.. భారత సాంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయన్న కిషన్‌రెడ్డి.. సాధు, సంతుల దీవెనలతో, విదేశాల్లోని విగ్రహాలు, చిహ్నాలు, చిత్రపటాలు ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.. విదేశాల్లోని విగ్రహాలు వెనక్కి తీసుకువచ్చిన ప్రధాని మోడీకి దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు కిషన్‌రెడ్డి.. వారణాసి “సిటీ అప్ టెంపుల్స్”… మాతా అన్నపూర్ణ దేవి విగ్రహాన్నీ వెనక్కి తీసుకురావడం పట్ల యూపీ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.