సిట్ వారు సహకరించారు.. వారు ఆడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను... కేసుతో నాకేం సంబంధం లేదు.. అంతా పైవాళ్లే చేశారని నేను ఎక్కడ సిట్ అధికారులకు చెప్పలేదని స్పష్టం చేశారు.. సిట్ అధికారులు ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగాన.. నేను సమాధానం చెప్పాను... నన్ను అరెస్టు చేశారంటూ కోందరూ అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎక్స్ లో స్పందించిన ఆయన.. ఆదాయాలు తగ్గిపోయి, అప్పులు పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాగ్ నివేదికలపై ఎక్స్ లో ట్వీట్ చేశారు జగన్..
జకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో నారా రోహిత్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి, సినిమాలోకి వస్తే ఎవరు ఆపారని ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్... మొత్తంగా ఓ ఈవెంట్లో పవన్ కల్యాణ్ వాడిన మనల్ని ఎవడ్రా ఆపేది..? డైలాగ్‌ను గుర్తుచేసినట్టు అయ్యింది..
స్నేహితులే కాలయములుగా మారి భార్యను అసభ్యకరంగా దూషించడనే నేపంతో స్నేహితుడిని హత్య చేశాడు . రైల్వే స్టేషన్ లో సమోసాలు అమ్ముకునే ఇద్దరు స్నేహితుల మధ్య మద్యం మత్తులో వివాదం ఏర్పడింది. ఈ వివాదంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. తన భార్యను అసభ్యకరంగా మాట్లాడటంతో ఈ హత్యకు దారితీసింది. రాఖీ పండుగ రోజున జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది..
ఘోర పరాజయం నుంచి కోలుకున్న వైసీపీ... క్రమంగా యాక్టివిటీ పెంచుతోంది. రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ... నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మారుస్తూ... కేడర్ని రీ ఛార్జ్ మోడ్‌లోకి తీసుకువస్తోంది. అయితే... ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా మ్యూట్ మోడ్‌లో ఉండటం ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారట కార్యకర్తలు. అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు దాదాపుదా నిలిచిపోయినట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కాకినాడ రూరల్ టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు పదవికి రాజీనామా చేశారు. కారణాలను వివరిస్తూ... పార్టీ అధిష్టానానికి సుదీర్ఘ లేఖ రాశారాయన. అదంతా ఒక ఎత్తయితే... ఈ పరిణామాల గురించి మాత్రం తెగ గుసగుసలాడేసుకుంటోంది లోకల్ టీడీపీ కేడర్. ఏ ప్రయోజనాలు ఆశించి పిల్లి ఈ స్టంట్స్ చేస్తున్నారన్నది కేడర్ క్వశ్చన్. అధికార పార్టీలో కో ఆర్డినేటర్ పదవి అంటే... ఒక స్థాయి, స్థానం ఉంటుంది. అలాంటి పోస్ట్‌ను కూడా పిల్లి దంపతులు ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు? కొత్త వివాదాన్ని ఎందుకు తెర…
ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి చేసిన విశ్లేషణ చర్చనీయాంశంగా మారింది. వివిధ సామాజికవర్గాల వారీగా వైసీపీకి పడ్డ ఓట్లు....కూటమి పార్టీలకు లభించిన మద్దతు గురించి ఓపెన్ డిస్కషన్ పెట్టారాయన. విశాఖలో జరిగిన వైసీపీ SC విభాగం ప్రాంతీయ సమావేశంలో ఆసక్తికరమైన లెక్కలు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ నా SC, నా ఎస్.టి., నా బీసీ., నా మైనారిటీ అని ఎంతగా చెప్పినా.... పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చేసరికి అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదన్నది అమర్నాథ్ వాదన. బీసీలు 30 నుంచి 35శాతం, కాపులు…
యూరియా కొనుగోళ్లపై ఆంక్షలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. యూరియాను తక్షణ పంట అవసరాలకు మాత్రమే కొనుగోలు చేయాలి.. వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు యూరియా వినియోగిస్తే కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు..
సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు...ప్రస్తుతం ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు.. భవిష్యత్తులో పెర్ఫార్మన్స్ ప్రకారం ర్యాంకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల పనితీరు మెరుగు పర్చుకోవాలనే ఉద్దేశం తో ర్యాంక్ లు ఇస్తున్నారా.. లేకపోతే.. మంత్రులు కొన్ని అంశాల్లో వెనక బడ్డారని చెప్పడానికి ర్యాంక్ లు ఇస్తున్నారా..?