-
COVID 19: తెలంగాణలో భారీగా తగ్గిన కేసులు
తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 41,310 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 453 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 1,380 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారిఉ.. ప్రస్తుతం రాష్ట్రంలో 6,746 యాక్టివ్ కేసులు ఉండగా… మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 7,85,596కు, రికవరీ కేసులు 7,74,742కు పెరిగాయి.. మరోవైపు కోవిడ్ […] -
Delhi: ఐఈడీ బాంబుల కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబులు కలకలం సృష్టించాయి… ఈశాన్య ఢిల్లీ సీమాపురి ప్రాంతంలో ఐఈడీ బాంబు గుర్తించారు… ఎవరూ లేని ఓ అపార్టమెంట్ నుంచి పేలుడు పదార్ధాలున్న సంచిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. ఆ అపార్ట్మెంట్ యజమాని ఖాశిం అనే కాంట్రాక్టర్… ఇటీవలే ఖాశిం తండ్రి మరణించినట్లు సమాచారం.. ఇక, ఆ అపార్ట్‌మెంట్‌ను ముగ్గురు, నలుగురు యువకులకు ఖాశిం అద్దెకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం అద్దెకు దిన యువకులు పరారీలో ఉన్నట్టు చెబుతున్న పోలీసులు.. ఆ […] -
Bajireddy: బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. కొట్టడమే కరెక్ట్..!
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల పర్యటనలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.. ఇక, కొన్ని సందర్భాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధుల పర్యటనలను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి.. కొన్ని సార్లు, దాడులు, ప్రతిదాడులకు కూడా దారితీశాయి.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు […] -
High Court: రైతు బీమాపై పిటిషన్.. ప్రభుత్వానికి ఆదేశాలు..
రైతు బీమా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది రైతులు ఉంటే.. కేవలం 32 లక్షల మందికి మాత్రమే బీమా చేశారని తన పిటిషన్లో పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 34 లక్షల మంది రైతులకు భీమా వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విన్నవించారు… అయితే, దీనిపై విచారణ […] -
High Court: ప్రభుత్వ భూముల విక్రయానికి గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ భూములను వేలం ద్వారా విక్రయించింది తెలంగాణ సర్కార్.. భూముల వేలం ద్వారా వేల కోట్లు ప్రభుత్వ ఖాజానాకు చేరాయి.. అయితే, ఈ మధ్యే కోకాపేట, ఖానామెట్‌లో జరిగిన భూముల వేలంపై భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి హైకోర్టును ఆశ్రయించారు.. విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వ భూముల విక్రయానికి పచ్చజెండా చూపింది… ప్రభుత్వం తన భూములను విక్రయించడాన్ని తప్పుపట్టలేమంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది హైకోర్టు.. భూముల విక్రయంలో ప్రభుత్వం […] -
Gautam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్ పదవిలో ట్విస్ట్..!
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఆ పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం… మొదట ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని విషయం తెలిసిందే.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.. అయితే, తాజాగా, ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.. అయితే, గౌతమ్ సవాంగ్‌కు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి విషయంలో ఓ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. ఐపీఎస్ హోదాలో ఉండగా రాజ్యాంగబద్ద పదవి చేపట్టొచ్చా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతోంది ప్రభుత్వం.. రాజీనామా చేసిన తర్వాతే ఏపీపీఎస్సీ ఛైర్మన్ గిరీ […] -
Jagga Reddy: కేసీఆర్ బర్త్‌డే, నిరుద్యోగానికి సంబంధం ఏంటి..?
ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతుంటే.. మరోవైపు.. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ… ఈ వ్యవహారంలో టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.. అయితే, ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ముఖ్యమంత్రి జన్మదినం చేస్కోవడంలో తప్పేముంది..? అని ప్రశ్నించారు.. సీఎం బర్త్‌డేకు నిరుద్యోగానికి సంబంధం ఏంటి? అని నిలదీశారు.. […] -
AP COVID 19: మరింత కిందకు రోజువారి కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,339 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 528 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ఇవాళ ఇద్దరు మృతి చెందారు.. ఇదే సమయంలో 1,864 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. Read Also: Pawan Kalyan: సభ్యత్వ నమోదుకు జనసేనాని […] -
Pawan Kalyan: సభ్యత్వ నమోదుకు జనసేనాని పిలుపు
అన్ని రాజకీయ పార్టీలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఫోకస్ పెడుతున్నాయి.. జనసేన పార్టీ కూడా క్రియాశీల సభ్యత్వ నమోదుపై దృష్టిసారించింది.. దీనికోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన ఆయన.. జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2 వేల […] -
Viral: మరో వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. నీ సంగతి చూస్తా..!
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు… సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే.. ఎదైనా పిచ్చి పోస్టులు పెడితే సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించిన ఆయన.. ఇంకో సారి పోస్టు పెడితే నీ సంగతి చెబుతా నంటూ సీరియస్‌గా హెచ్చరించారు.. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.. […]
తాజావార్తలు
-
School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
-
Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
-
MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!