సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. కీలకంగా భావిస్తున్న సినీ నటుడు నవదీప్‌ను ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్… ఇవాళ 9 గంటలకు పైగా నవదీప్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు.. నవదీప్‌తో పాటు ఎఫ్ కేఫ్ లాంజ్ జీఎం అర్పిత్ సింగ్‌ను కూడా సుదీర్ఘంగా విచారించారు.. నవదీప్‌తో పాటు క్లబ్‌కు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీశారు.. ఎఫ్ కేఫ్ జీఎం అర్పిత్ సింగ్ కు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలపై పరిశీలించిన ఈడీ.. నవదీప్, అర్పిత్ […]
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు.. కొన్ని రోజులుగా మంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన… ఇవాళ తుదిశ్వాస విడిచారు. జులైలో యోగా చేస్తూ పడిపోవడంతో ఫెర్నాండెజ్ తలకు గాయమై, రక్తం గడ్డ కట్టింది. డాక్టర్లు సర్జరీ చేశారు. ఐతే చికిత్స తర్వాత కూడా ఫెర్నాండెజ్ కోలుకోలేకపోయారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఫెర్నాండెజ్ గాంధీ కుటుంబానికి ఆప్తులు. సోనియా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. మాజీ […]
వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో… ఇండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 75 కోట్ల డోసుల టీకా పూర్తైంది. వ్యాక్సినేషన్ మొదలయ్యాక, తొలి 10 కోట్ల డోసులు పూర్తవ్వడానికి 85 రోజులు పడితే, ఇప్పుడు కేవలం 13 రోజుల్లో 10 కోట్ల డోసులు పూర్తి చేశారు. ఈ రికార్డుతో వ్యాక్సినేషన్ డ్రైవ్ 75 కోట్ల డోసుల మైలురాయిని క్రాస్ చేసింది. డిసెంబర్ నాటికి దేశ జనాభాలో 43 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది కేంద్రం. ఇక..మూడు […]
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,974 శాంపిల్స్ పరీక్షించగా 315 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందారు. ఇక, ఒకేరోజు 318 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో చేసిన టెస్ట్‌ల సంఖ్య 2,55,03,276కు చేరగా.. పాజిటివ్ కేసులు 6,61,866కు పెరిగాయి.. […]
గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి జరుగుతున్న కృషి అభినందనీయమన్న ఆయన.. అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు.. అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేసి… తెలంగాణకు కాంగ్రెస్ మాత్రమే దిక్సూచి అని నిరూపించాలని సూచించారు. దీనికోసం నా వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు జానారెడ్డి.. ఇక, అడుగడుగున పిలిస్తే నేను రాలేదు అని అనుకోకండి.. మీరు ఏదైనా […]
తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్లోనైనా వాట్సాప్ ఉండాల్సిందేనన్న రేంజ్‌కి వెళ్లిపోయింది.. దాని వెనుక ఆ సంస్థ కృషి కూడా ఎంతో ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో.. తమ యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది వాట్సాప్.. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతోంది. వాట్సప్‌లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవకాశం ఉన్నా.. ఇప్పటికీ ఎక్కువ మంది మెసేజ్‌లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. మెసేజ్ పంపించాలంటే.. […]
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన.. గతంలో కాంగ్రెస్ కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలిస్తే.. ఇప్పుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు.. ఇక, బండి సంజయ్ తన పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర […]
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌కి.. తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.. ఇక, కేసీఆర్.. ఒవైసీ సోదరుల మొప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆర్టికల్ […]
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో గుజ్జుల మహేష్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది.. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. ఏమీ చేయకుండా కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టారు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు […]