ఏపీపై వైపు మరో తుఫాన్ తూసుకొస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్రపై తీవ్ర వాయుగుండం ప్రభావం ప్రారంభమైంది.. తీరం వెంబడి క్రమేపీ గాలుల తీవ్రత కూడా పెరుగుతోంది.. సముద్రం అలజడిగా మారిపోయింది.. ఈదురు గాలులు తీవ్రత క్రమంగా పెరగడంతో.. వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, DMHOలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కీలక సూచనలు చేశారు.. తుఫాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై సీఎం వైఎస్ జగన్ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అదేశాలు ఇచ్చినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.. ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడిన వాయిగుండంతో ఈ జిల్లాల్లో ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందోస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమంలో అధికారులు సమన్వయంతో జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Read Also: ఒమిక్రాన్‌పై స్టడీ.. రీఇన్‌ఫెక్షన్లు ఎక్కువే..!
ఇక, పునరావాస కేంద్రాలు వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి ఆళ్ల నాని.. మూడు షిఫ్ట్ ల్లో వైద్య టీమ్స్ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు… సీనియర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహణలో మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు. వైద్య శిబిరాలు వద్ద విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే డీజిల్, జనరేటర్ ఏర్పాటు చేసుకునేలా తగిన జాగ్రత్తలు చేపట్టాలని DMHOలకు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల DMHOలు, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసిన ఆయన.. మెడికల్ క్యాంపుల వద్ద అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని.. ప్రజలకు అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని విధాలుగా ముందోస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ వల్ల ఏర్పడే పరిస్థితులు వల్ల ప్రజలు ఎక్కడ కూడ ఇబ్బంది పడకుండా చూడాలని.. జిల్లా, డివిజన్, కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు తుఫాన్ పరిస్థితి పర్యవేక్షణ చేయాలని.. కరోనా నిబంధనలు పాటిస్తూ తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల అధికారులు.. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు మంత్రి ఆళ్లనాని.