గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి జరుగుతున్న కృషి అభినందనీయమన్న ఆయన.. అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుందన్నారు.. అందరూ ఐక్యమత్యంతో కలిసి పనిచేసి… తెలంగాణకు కాంగ్రెస్ మాత్రమే దిక్సూచి అని నిరూపించాలని సూచించారు. దీనికోసం నా వంతు సహకారం ఉంటుందని స్పష్టం చేశారు జానారెడ్డి.. ఇక, అడుగడుగున పిలిస్తే నేను రాలేదు అని అనుకోకండి.. మీరు ఏదైనా […]
తక్కువ కాలంలోనే కోట్లాది మంది అభిమానాన్ని చురగొంది వాట్సాప్.. ఇప్పుడు ఏ స్మార్ట్ ఫోన్లోనైనా వాట్సాప్ ఉండాల్సిందేనన్న రేంజ్‌కి వెళ్లిపోయింది.. దాని వెనుక ఆ సంస్థ కృషి కూడా ఎంతో ఉంది.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో.. తమ యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంది వాట్సాప్.. ఇప్పుడు తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ఎలా ఉపయోగించుకోవాలో చెబుతోంది. వాట్సప్‌లో చాటింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అవకాశం ఉన్నా.. ఇప్పటికీ ఎక్కువ మంది మెసేజ్‌లు పంపించుకోవడానికే ఉపయోగిస్తారు. మెసేజ్ పంపించాలంటే.. […]
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించిన ఆయన.. గతంలో కాంగ్రెస్ కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలిస్తే.. ఇప్పుడు బీజేపీ లాతూర్ కు తరలించిందన్నారు.. ఇక, బండి సంజయ్ తన పాదయాత్రను ఢిల్లీ వైపు మార్చి.. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి పోరాడాలని సూచించారు. సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర […]
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌కి.. తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.. ఇక, కేసీఆర్.. ఒవైసీ సోదరుల మొప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆర్టికల్ […]
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో గుజ్జుల మహేష్‌కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పీసీసీ చీఫ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరుగుతుంది.. ఏదో చేస్తాడని రెండు సార్లు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. ఏమీ చేయకుండా కుటుంబ పాలన చేస్తున్నారంటూ మండిపడ్డారు.. కుటుంబ సభ్యులకు వందల ఎకరాల భూములు కట్టబెట్టారు.. ఆంధ్ర కాంట్రాక్టర్లకు […]
న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ.. విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు.. ఈ ఛార్జిషీట్లో నలుగురిపై అభియోగాలు నమోదు చేసింది సీబీఐ.. ధనిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్, ఆదర్శ రెడ్డి, లవునిరు సాంబశివారెడ్డిలపై అభియోగాలు మోపింది.. ఇక, ఈ కేసులో మరో 16 మంది పేర్లను ఛార్జిషీట్లో పొందుపర్చింది సీబీఐ.. కాగా, ప్రభుత్వానికి సంబంధించిన కేసుల్లో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా […]
గుజరాత్ సర్కార్‌లో వేగంగా పరిణామాలు మరిపోయాయి.. సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ.. ఆ తర్వాత తదుపరి గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ పేరును ప్రతిపాదించారు.. ఇక, అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. మొత్తంగా గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు 59 ఏళ్ల భూపేంద్ర పటేల్.. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ ఆచార్య దేవ్ వరాత్.. భూపేంద్ర పటేల్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, నిన్న సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం భూపేంద్రను ఏకగ్రీవంగా […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. దీనికి ప్రధానం కారణం టెస్ట్‌ల సంఖ్య కూడా తగ్గించడంగా చెప్పుకోవచ్చు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,746 శాంపిల్స్ పరీక్షించగా.. 864 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. మరో 12 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. చిత్తూరులో నలుగురు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో ఒక్కొక్కరు మరణించారు. […]
పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల […]
ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధం అవుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వారం రోజుల్లో ఆన్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారిని ప్రారంభిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈ నెల 18వ తేదీ నుంచి పెరటాసి మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు నిలిపివేసే యోచనలో ఉంది టీటీడీ.. టోకెన్ల కోసం తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం వుండడంతో కోవిడ్ నిబంధనలు అమలు చేయడం కష్టం అవుతుందని.. […]